Anil Ambani Issue : అనిల్ అంబానిపై సెబీ నిషేధం ఎందుకో తెలుసా.. ఏకంగా అంత జరిమానా విధించిందా..?

అనిల్ అంబానీపై సెబీ నిషేధం విధించింది. దీంతో పాటు ఆయనకు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఇంతకీ అనిల్ ఏం చేశారు..? ఆయన కంపెనీల్లో జరిగిన అక్రమాలు ఏంటి..?

Written By: Mahi, Updated On : August 27, 2024 1:27 pm

SEBI ban on Anil Ambani

Follow us on

Anil Ambani Issue: అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆగస్టు 23న నిషేధం విధించింది. అనుంబంధిత 24 సంస్థల్లో ఏకంగా రూ.624 కోట్లు జరిమానా విధించింది. ఇక రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో నిధుల అక్రమాల వ్యవహారంలో సెబీ ఈ చర్యలు తీసుకుంది. ఇకపై అనిల్ అంబానీతో పాటు పలువురు సెక్యూరిటీస్ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు పెట్టింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో ఉన్న రిజిస్టర్డ్ కంపెనీల్లో ఏ కీలక బాధ్యతల్లో ఆయన ఉండకూడదని పేర్కొంది. అయితే అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధులను మళ్లించినట్లు సమాచారం. కంపెనీలో కీలక అధికారులతో కలిసి అంబానీ కుట్ర పన్నారని పేర్కొంది. సంస్థలోని పలువురు డైరెక్టర్లు అడ్డుచెప్పినా వినిపించుకోలేదని సమాచారం. నిబంధనలు అతిక్రమించి ఈ నిధుల మళ్లింపు చేసినందుకు ఈ నిషేధం విధించినట్లు సెబీ పేర్కొంది. మార్కెట్ల నుంచి ఇక రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ పై కూడా 6 నెలల పాటు నిషేధం విధించింది. రూ. 6 లక్షల జరిమానా కూడా విధించింది. నిధుల మళ్లింపులో మరికొన్ని సంస్థలు మధ్యవర్తిగా నిలిచాయని సెబీ ఇందులో పేర్కొంది. ఇక రుణాలు పొందిన కంపెనీల్లో చాలా వరకు తిరిగి చెల్లించలేదని సమాచారం. ఫలితంగా ఆర్ ఎఫ్ హెచ్ ఎల్ దివాలా తీసిందని పేర్కొన్నారు. తద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్ల పరిస్థతి దారుణంగా తయారైందని పేర్కొంది. కాగా, 2018లో కంపెనీ షేరు ధర రూ. 59.60 వద్ద ఉందని తెలిపింది. 2020 లో కంపెనీలో జరుగుతున్న అక్రమాలు బయటకు రావడం, నిధులు లేకపోవడంతో షేరు విలు రూ. 0.75కు పడిపోయింది. ఇప్పటికీ దాదాపు 9 లక్షల మంది వాటాదారులు నష్టా్ల్లో ఉన్నారని సెబీ నివేదిక పేర్కొంది.

అయితే 2022లోనూ సెబీ నిషేధాన్ని అనిల్ ఎదుర్కొన్నారు.
అయితే సెబీ ఆదేశాలను అనిల్ సమీక్షిస్తున్నారని ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. 2022లో వచ్చిన ఆదేశాల మేరకే ఆయన రిలయన్స్ ఇన్ ఫ్రా, రిలయన్స్ పవర్ బోర్డుల నుంచి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 2018-19లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో సెబీ ఈ దర్యాప్తు చేపట్టింది.

అనిల్ కు చెందిన పలు సంస్థల్లోకి ఈ నిధుల మళ్లింపు జరిగిందని తేల్చింది. ఈ నేపథ్యంలోనే అనిల్ పై చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. రూ, 25 కోట్లు జరిమానా విధించింది. ఇక సంస్థపై కూడా 6 నెలల పాటు మార్కెట్లలో పాల్గొనవద్దని ఆదేశాలిచ్చింది.

2019లో కంపెనీ ఆడిటర్ రాజీనామా అనంతరం పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్పొరేట్ ప్రయోజనాల కోసం 2018 మార్చిలో కంపెనీ పంపిణీ చేసిన రుణాలు రూ. 900 కోట్లు ఉంటే 2019 మార్చి వరకు రూ. 7900 కోట్లకు చేరాయి. ఇక 7వేల కోట్ల బదిలీలో మోసం స్పష్టంగా కనిపించడంతో కంపెనీ షేరు విలువ రూ.0. 75 కి పడిపోయింది.

2024 నాటికి 45 కంపెనీలకు ఒకే రోజున రూ. 8470 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో ఉన్న 41 కంపెనీలు ఉమ్మడి అడ్రస్, ఈ మెయిల్ ను కలిగి ఉన్నాయి. ఇక్కడే సెబీకి పూర్తి అవగాహన వచ్చింది. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు ఆరా తీసి, చర్యలకు ఉపక్రమించింది.