Satyadev: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, అతి తక్కువ సమయంలోనే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన హీరోలలో ఒకడు విజయ్ దేవరకొండ. కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం ద్వారా ఈయన మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత ‘పెళ్లి కొడుకు’ చిత్రం తో హీరోగా మారి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ ని ఏ రేంజ్ కి తీసుకెళ్ళిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యూత్ ఆడియన్స్ లో విజయ్ దేవరకొండ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం ఆయన్ని యూత్ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. ఇక ఈ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ కి కష్టకాలం మొదలైంది. టాక్సీ వాలా చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. విజయ్ దేవరకొండ మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ‘లైగర్’ చిత్రం ఆయన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. అలాగే ఆయనకి ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ పెట్ల ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో డిజాస్టర్ ని అందించాడు. ఇప్పుడు ఆయన గౌతమ్ తిన్ననూరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చెయ్యాలనుకున్న చిత్రమిది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ చేతికి వెళ్ళింది. హీరోయిన్ గా ముందు శ్రీలీల ని తీసుకున్నారు కానీ, ఆమెని కూడా కొన్ని కారణాల వల్ల తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో ప్రముఖ యంగ్ హీరో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. సత్య దేవ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా సొంతంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వ్యక్తి. అయితే ఈమధ్య కాలంలో ఈయనకి కూడా సరైన హిట్ లేదు.
ఇన్ని రోజులు ఆయన ఎలాంటి పాత్ర కోసం అయితే ఎదురు చూస్తున్నాడో, అలాంటి పాత్ర ఈ చిత్రంలో దొరికింది. మళ్ళీ కం బ్యాక్ ఇచ్చేందుకు సత్యదేవ్ కి కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాడు. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు, ఆయన రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసాడు. ముందు ఒక తమిళ హీరోని ఈ పాత్రకోసం సంప్రదించారు కానీ, ఎందుకో కుదరలేదు. మరి ఈ పాత్ర సత్యదేవ్ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Satyadev remuneration in vijay devarakonda movie is very well known
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com