Scooters with 20000 Discount: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగిపోతుంది. అయితే మార్కెట్లోకి ఎన్నో రకాల కంపెనీలకు చెందిన EV లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ఆదరణ పొందుతూ ఉంటాయి. అయితే ఇవి ఆదరణ పొందినప్పటికీ ఒక్కోసారి కంపెనీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ Ather కంపెనీ ఇప్పటికే ఆకట్టుకుని మోడల్స్ ను పరిచయం చేసింది. అయితే అప్డేట్ అయిన వినియోగదారుల కోసం కొత్తగా స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిపై ఏకంగా రూ.20,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. కొత్తగా స్కూటర్ కొనే వారితోపాటు సెకండ్ ఆప్షన్ గా కొనుగోలు చేసేవారికి ఈ తగ్గింపు ప్రయోజనాలు ఉండనున్నాయి. అయితే ఏ స్కూటర్ పై.. ఎలాంటి తగ్గింపు ఉంటుందో చూద్దాం..
Ather కంపెనీకి చెందిన Energy స్కూటర్ కొనుగోలు చేసే వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపై కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎనర్జీ Rizda, 450 సిరీస్ లతో సహా ఎలక్ట్రిక్ వాహనాలన్నీటిపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇందులో క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్కూటర్లను కొనుగోలు చేస్తే రూ
10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ.6,500 నగదు . రూ.3,500 వరకు ఎక్స్టెండెడ్ కాంపోనెంట్స్ వారంటీ ఉండనుంది. ఇలా మొత్తం రూ. 20000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు మార్చి నెలాఖరులపై ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలోని ఏతర్ డీలర్షిప్ అన్నింటిలో ఇది వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం Rizda ధర రూ.1,04,758 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.450 C స్కూటర్ ధర రూ.1,13,100 తో సేల్స్ చేస్తున్నారు.
Ather కంపెనీ ఇప్పటివరకు ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే జెన్ జెడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ రెండు స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో 450 C స్కూటర్ లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు sporty రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. అలాగే Rizda స్కూటర్ చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటుంది. రోజువారి వినియోగదారులతోపాటు ఉద్యోగులకు తమ అవసరాలను తీరుస్తుంది.
ఈ స్కూటర్లో ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇందులో 2.9 kWh బ్యాటరీ ఉండగా.. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్ల మైలేజ్ నీ అందిస్తుంది. ఇందులో స్వీట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఓవర్ ది ఎయిర్ అప్డేట్, రివర్స్ మోడ్, లైవ్ ట్రాకింగ్ వంటి స్మార్ట్ ఫ్యూచర్లో ఉన్నాయి. అలాగే 450 ఇంజన్ కలిగిన స్కూటర్లో 6.4 kW బ్యాటరీ ఉంది. కంబైండ్ బ్రేకింగ్ సిస్టం, ఫ్రంట్ డిస్క్ ఉండడంతో సేఫ్టీని అందిస్తుంది.