దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. దేశంలోని యువత వ్యవసాయంపై ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే. వ్యవసాయం చేస్తే లాభాల కంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువని చాలామందిలో భావన ఉంది. అయితే ఒక మహిళ మాత్రం వ్యవసాయంపై ఉండే ఆసక్తితో పీ.హెచ్.డీ వదిలి మన దేశానికి వచ్చి లక్షల్లో సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పూర్వీకుల నుంచి వారసత్వంగా మూడున్నర ఎకరాల భూమి రాగా ఆ భూమిలోనే కూరగాయలను, పంటలను పండిస్తూ ఇన్షా రసూల్ వార్తల్లో నిలిచారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఈ మహిళ విజయం సాధించడం గమనార్హం. వ్యవసాయం మొదలుపెట్టిన సమయంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఇన్షా రసూల్ రైతుల దగ్గర సలహాలు, సూచనలు తీసుకుని ముందడుగులు వేశారు. కెరీర్ తొలినాళ్లలో ఇన్షా రసూల్ చేసిన ప్రయత్నాలలో చాలా ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
అయితే ఇన్షా రసూల్ మాత్రం ఒక్కరోజు కూడా నిరాశ చెందలేదు. వ్యవసాయాన్నే వృత్తిగా మార్చుకుని ఇన్షా రసూల్ కెరీర్ ను కొనసాగించారు. భూమిలో వేర్వేరు పంటలను వేస్తూ అంతర పంటలు వేయడం ద్వారా తెగుళ్లకు ఇన్షా రసూల్ చెక్ పెట్టారు. పండించిన పంటలను సోషల్ మీడియా ద్వారా ఈమె విక్రయిస్తున్నారు. గతేడాది వ్యవసాయం చేయడం ద్వారా ఈమె సంపాదించిన మొత్తం ఏకంగా 8 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
ఫ్రెంచ్ బీన్స్,బఠానీలు అనేక లాభాలను తెచ్చిపెడుతున్నాయని ఈమె వెల్లడించారు. త్వరలో మరిన్ని పంటలు పండించడంతో పాటు ఫౌల్ట్రీ విభాగాన్ని స్టార్ట్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇన్షా రసూల్ ఇతర రైతులకు కూడా శిక్షణ ఇస్తూ ఎక్కువ ధరకు కూరగాయలు అమ్ముడయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు