ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. విత్ డ్రా పరిమితి భారీగా పెంపు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. క్యాష్ విత్‌డ్రాయెల్ పరిమితిని తాత్కాలికంగా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇకపై కస్టమర్లు హోం బ్రాంచ్ కు వెళ్లకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ ఏ బ్రాంచ్ లోనైనా లక్ష వరకు విత్ డ్రా చేయడానికి అనుమతిని ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. త్వరలో ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎస్బీఐ తీసుకున్న ఈ […]

Written By: Kusuma Aggunna, Updated On : May 27, 2021 8:55 pm
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. క్యాష్ విత్‌డ్రాయెల్ పరిమితిని తాత్కాలికంగా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇకపై కస్టమర్లు హోం బ్రాంచ్ కు వెళ్లకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ ఏ బ్రాంచ్ లోనైనా లక్ష వరకు విత్ డ్రా చేయడానికి అనుమతిని ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. త్వరలో ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే చెక్ ద్వారా మాత్రమే కస్టమర్లు లక్ష రూపాయల మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. సేవింగ్స్ బ్యాంక్ పాస్ బుక్, విత్‌డ్రాయెల్ ఫామ్ ద్వారా రోజుకు 25వేల రూపాయలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

థర్డ్ పార్టీ క్యాష్ విత్‌డ్రాయెల్‌కు కూడా ఎస్బీఐ అనుమతులు ఇవ్వగా చెక్ ద్వారా 50వేల రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మరోవైపు ఎస్బీఐ ఒకవైపు శుభవార్తలు చెబుతూనే మరోవైపు కస్టమర్లకు షాక్ ఇస్తోంది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ బుక్, ట్రాన్స్‌ఫర్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎస్బీఐ కొత్త ఛార్జీలను అమలులోకి తీసుకురానుంది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావించే వాళ్లు కేవైసీ డాక్యుమెంట్లను అందించి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఎస్బీఐ జులై 1వ తేదీ నుంచి ఛార్జీలను భారీగా పెంచితే మాత్రం 40 కోట్ల మందికి పైగా కస్టమర్లపై ఆ ప్రభావం పడుతుంది.