రఘురామకు వింతరోగాలు? ఏం జరిగింది?

ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన రఘురామకృష్ణంరాజును జైలుకు, జీజీహెచ్ ఆస్పత్రికి సహా అటూ ఇటూ పోలీసులు తింపారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపారు. ఈ మధ్యలో ఏమిచ్చారో? ఏంచికిత్స చేశారోనన్న ఆందోళన రఘురామకు, ఆయన కుటుంబానికి ఉంది. అందుకే తాజాగా సికింద్రాబాద్ నుంచి నేరుగా ఢిల్లీలోని ఎయిమ్స్ వెళ్లిపోయారు. అయితే ఏపీ, తెలంగాణ ఆస్పత్రుల్లో బయటపడని రోగాలు ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లిన తర్వాత ఎంపీ రఘురామకు కొత్త సమస్యలు వెలుగుచూసినట్లు సమాచారం. ఎంపీ రఘురామ పాదాల్లో […]

Written By: NARESH, Updated On : May 27, 2021 9:57 pm
Follow us on

ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన రఘురామకృష్ణంరాజును జైలుకు, జీజీహెచ్ ఆస్పత్రికి సహా అటూ ఇటూ పోలీసులు తింపారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపారు. ఈ మధ్యలో ఏమిచ్చారో? ఏంచికిత్స చేశారోనన్న ఆందోళన రఘురామకు, ఆయన కుటుంబానికి ఉంది. అందుకే తాజాగా సికింద్రాబాద్ నుంచి నేరుగా ఢిల్లీలోని ఎయిమ్స్ వెళ్లిపోయారు.

అయితే ఏపీ, తెలంగాణ ఆస్పత్రుల్లో బయటపడని రోగాలు ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లిన తర్వాత ఎంపీ రఘురామకు కొత్త సమస్యలు వెలుగుచూసినట్లు సమాచారం.

ఎంపీ రఘురామ పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్టు తాజాగా పరిశీలనలో వైద్యులు గుర్తించినట్టు సమాచారం. సికింద్రాబాద్ సైనిక ఆస్పత్రిలో రఘురామ కాలికి గాయాలు తగ్గలేదు. నొప్పి విపరీతంగా ఉండడం.. బీపీ కంట్రోల్ కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బుధవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. అక్కడ పరీక్షల్లో సెల్ డ్యామేజ్ బాగా జరిగినట్లు బయటపడింది.

ప్రస్తుతం రఘురామ కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టి నడవకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు తెలిసింది. రెండు వారాల పాటు కదలకుండా ఉండాలని చెప్పినట్టు తెలిసింది.

ఎయిమ్స్ లో పరీక్షల అనంతరం కట్టు కట్టి ఆయనను అధికారిక నివాసానికి పంపించారు. అక్కడే రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది.