దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలని భావించే వాళ్ల కోసం ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొత్త ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఓపెన్ ఎండెడ్ ఫండ్ అయిన ఎస్బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ఎన్ఎఫ్‌వో లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు రెండు ఆప్షన్లు ఉంటాయి. పెట్టుబడి పెట్టిన ఐదు సంవత్సరాల లోపు డబ్బులను వెనక్కు తీసుకోవడం లేదా రిటైర్మెంట్ వరకు డబ్బులు పెట్టడం చేయవచ్చు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ఎన్ఎఫ్‌వో లో మొత్తం నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అగ్రెసివ్ ఆప్షన్ లో 80 – 100 శాతం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అగ్రెసివ్ హైబ్రిడ్ ఆప్షన్ లో ఈక్విటీలో 65 – 80 శాతం ఇన్వెస్ట్ చేయవచ్చు. కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఆప్షన్ లో డెట్ సాధనాల్లో 60 శాతం నుంచి 90 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కన్సర్వేటివ్ ఆప్షన్ లో డెట్ సాధనల్లో 80 శాతం నుంచి 100 శాతం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
మొదట 5 వేల రూపాయలు చెల్లించి ఆ తరువాత సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఫండ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ఎన్ఎఫ్‌వో స్కీమ్ కు సంబంధించిన ప్రతి ఆప్షన్ లో 20 శాతం గోల్డ్ ఈటీఎఫ్ లలో, 10 శాతం రీట్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వారికి 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. దీర్ఘకాలంలో మంచి రాబడి ఆశించే వాళ్లకు ఈ స్కీమ్ ఉత్తమమని చెప్పవచ్చు.