https://oktelugu.com/

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..?

సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి నెల తొలివారం నుంచి జరిగేవి. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ ఏడాది పరీక్షలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. Also Read: అమ్మాయిలకు శుభవార్త.. రూ.25,000 స్కాలర్ షిప్ పొందే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2021 / 08:09 AM IST
    Follow us on


    సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి నెల తొలివారం నుంచి జరిగేవి. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ ఏడాది పరీక్షలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

    Also Read: అమ్మాయిలకు శుభవార్త.. రూ.25,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

    నిన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఏ విధంగా జరుగుతున్నాయో ఇన్ స్టెంట్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు భవిష్యత్తులో సైతం అదే విధంగా జరుగుతాయని తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల తరువాత ఈ నెల 18వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని.. ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది ఇన్ స్టెంట్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ కోర్సులు చేస్తే జాబ్ గ్యారంటీ..?

    ఈ సంవత్సరం పనిదినాలను 160 రోజులకే పరిమితం చేస్తామని.. సీఎం జగన్ ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంటర్ ప్రవేశాలు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఆన్ లైన్ లోనే జరుగుతాయని.. నిబంధనలు అమలు చేయని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. 70 శాతం ట్యూషన్ ఫీజును మాత్రమే కాలేజీలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    స్టూడెంట్స్ నుంచి కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తీసుకుంటే పరిశీలన అనంతరం వాటిని వెనక్కు ఇచ్చేయాలని పేర్కొన్నారు. నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. తప్పనిసరిగా ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని మంత్రి అన్నారు. త్వరలోనే ప్రాక్టికల్స్, పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తారని తెలుస్తోంది.