Saving Bank: మనిషి జీవితాన్ని నడిపించేది డబ్బు. ఉదయం లేచిందగ్గర్నుంచి రాత్రి వరకు ప్రతీ అవసరం డబ్బుతో కొనాల్సింది. డబ్బు ఒకరి దగ్గర ఎక్కువ, మరొకరి దగ్గరి తక్కువ ఉంటుంది. కానీ డబ్బు లేని మనిషి మాత్రం ఉండరు. చాలా మంది రోజూవారీ అవసరాలతో పాటు భవిష్యత్ లో ఏదైనా అత్యవసం ఏర్పడినప్పుడు ఖర్చుపెట్టడానికి సేవింగ్స్ చేస్తారు. ఈ సేవింగ్ వివిధ రకాలుగా ఉంటుంది. కొంత మంది సంపాదించిన డబ్బును ఇంట్లో డబ్బాల్లోనూ, బీరువాల్లోనూ, బ్యాంకుల్లో సేవింగ్స్ చేస్తూ ఉంటారు. బ్యాంకుల్లో సేవింగ్ చేయడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ. ఇది కొంచెం ఆశ్చర్యమనిపించినా.. ఈ విషయం తెలిస్తే డబ్బును బ్యాంకుల్లో అస్సలు సేవ్ చేయరు. మరి ఆ వివరాల్లోకి వెళితే.
ఈ భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైన పనిచేస్తారు. కానీ ఒకరు ఫైనాన్షినయల్ గా డెవలప్ అవుతారు. మరొకరు మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉంటారు. దీనికి కారణం ఆ వ్యక్తికి ఉన్న అదృష్టం, దురదుష్టం అంటారు. ఒక వ్యక్తి జీవితం తన చేతుల్లోనే ఉందని అనుకున్నప్పుడు ఏ శక్తులైనా తన కిందికి రావాల్సిందే. అలాగే కొన్ని విషయాల్లో చాదస్తాన్ని వీడి ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళితే జీవితంలో సక్సెస్ అవుతారు.డబ్బు సేవింగ్ విషయంలోనూ కొస్త టెక్నిక్స్ ను యూజ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. అప్పుడే సంపాదించన డబ్బు కంటే రెట్టింపు అవుతుంది.
చాలా మంది డబ్బు సంపాదిస్తూ కేవలం ఇంట్లో, బ్యాంకులో సేవింగ్స్ చేస్తుంటారు. చిట్టీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నష్టాలు ఉంటాయని అనుకుంటారు. కానీ జీవితంలో కొన్ని రోజులైనా మంచిగా ఉంటే చాలు.. ఆ తరువాత జీవితాంతం సుఖపడొచ్చు. అలాగే డబ్బును పెట్టుబడి పెట్టుకుంటూ పోతే చాలు.. ఎప్పటికైనా అది రెట్టింపు అవుతుంది.
ఇంట్లో నిల్వ చేసిన డబ్బు 10 సంవత్సరాల తరువాత చూస్తే ఎంత సేవింగ్ చేశామో.. అంతే ఉంటుంది. అలాగే సేవింగ్ బ్యాంకులో ఉంచడం వల్ల 4 శాతం వడ్డీ మాత్రమే ఇస్తారు. దీనిని 6 శాతం ఇన్ ఫ్యూయెన్స్ ఉంటుంది. ఎప్పుడూ కానీ వడ్డీ కంటే ఇన్ ఫ్ల్యూయెన్స్ తక్కువగా ఉన్నప్పుడే డబ్బుకు వడ్డీ వస్తుంది. దీంతో బ్యాంకులో సేవింగ్ చేసిన డబ్బుకు నష్టాలు కలిగినట్లే. అదే ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, మ్యూచుఫల్ ఫండ్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి.. 10 సంవత్సరాల తరువాత ఇవి రెట్టింపు సాధిస్తాయి.