
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నెలకు 3,810 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏకంగా 27 లక్షల రూపాయలు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కరోనా వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం భవిష్యత్తు కోసం ముందుగానే ప్రణాళికలు సిద్దం చేసుకుంటే మంచిది.
ఎల్ఐసీ చక్కటి పాలసీని అందుబాటులో ఉంచగా ఈ పాలసీని తీసుకుంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్‌ఐసీ జీవన్ లక్ష్య పాలసీ నూతన వెర్షన్ అయిన కన్యాదాన్ స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. స్థిర ఆదాయంతో పాటు మూలధన భద్రతకు హామీ ఇవ్వడం ఈ పాలసీ యొక్క ప్రత్యేకత. ప్రీమియంను 22 సంవత్సరాలు చెల్లించి 25 సంవత్సరాల తర్వాత ఏకంగా రూ.27 లక్షలు పొందవచ్చు.
మధ్యలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, కుటుంబం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ మిగిలిన సంవత్సరాల్లో బీమా చేసిన వ్యక్తి కుమార్తెకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు లభిస్తాయి. కుమార్తె వయస్సు ప్రకారం, ఈ పాలసీ కాలపరిమితి తగ్గించడం జరుగుతుంది. ఈ పాలసీని ఎక్కువ లేదా తక్కువ ప్రీమియం కోసం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ పాలసీ తీసుకునే వ్యక్తికి కనీస వయస్సు 30 సంవత్సరాలు కాగా కుమార్తె వయస్సు ఒక సంవత్సరం ఉండాలి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.