Homeబిజినెస్Samsung inactivity restart feature: ఈ ఆప్షన్ తో మీ మొబైల్ సేఫ్.. సాంసంగ్ మొబైల్స్...

Samsung inactivity restart feature: ఈ ఆప్షన్ తో మీ మొబైల్ సేఫ్.. సాంసంగ్ మొబైల్స్ లో అందుబాటులోకి..

Samsung inactivity restart feature: ప్రస్తుత కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురి అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత విలువైన వస్తువుల్లో మొబైల్ కూడా ఒకటి. ప్రయాణాలు చేసేటప్పుడు.. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మొబైల్ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్స్ ఆధారంగా మొబైల్ ఎక్కడికి వెళ్లినా కూడా వెంటనే దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఇందులో డేటా ఒక్కోసారి మాయమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి డేటా మాయం కాకుండా.. లేదా మొబైల్ వెళ్లినా కూడా అది ఏ విధంగా పనిచేయకుండా చేసే విధంగా కొత్త సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారు. దీనినే Inactivity Restart అని అంటారు. దీనిని లేటెస్ట్ గా Samsung మొబైల్స్ లో ప్రవేశపెట్టారు. దీంతో ఫోన్ భద్రత ఉండడమే కాకుండా ఎలాంటి డేటా చోరీ కాకుండా ఉంచబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

ఇప్పటివరకు ఇలాంటి సెక్యూరిటీ కలిగిన సాఫ్ట్వేర్ కేవలం ఆపిల్ ఫోన్లలో మాత్రమే ఉండేది. Apple iOS 18.1 ఫీచర్ తో దీనికి సంబంధించిన మొబైల్స్ లో సెక్యూరిటీని ఇస్తుంది. ఇప్పుడు శాంసంగ్ మొబైల్స్ లో కూడా ఈ Inactivity Restart అనే సాఫ్ట్వేర్ అంతే స్థాయిలో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఒకసారి లాక్ పడింది అంటే 72 గంటల తర్వాతే దానిని పున ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. అలా మళ్లీ రీస్టార్ట్ చేసినప్పుడు డాటా ఎలాంటి చోరీకి గురికాకుండా ఉంటుంది. అయితే శాంసంగ్ కంపెనీకి చెందిన Galaxy మొబైల్స్ అన్నింటిలో ఈ ఫీచర్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి దీనిని సెట్ చేసుకోవాలి.

ఒకసారి మొబైల్ లాక్ పడి 72 గంటల తర్వాత రీస్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో ఫోన్ మొత్తం రీబూట్ చేయబడుతుంది. ఇలా రీబూట్ చేసినప్పుడు ఫోన్ మళ్ళీ యధాస్థితికి వస్తుంది. అంతేకాకుండా వినియోగదారుడు దానిని అన్లాక్ చేసిన తర్వాత లేదా బయోమెట్రిక్ లను ఉపయోగించి యాప్స్ ను ఓపెన్ చేసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్, మెసేజ్ అలర్ట్ వంటివి ఆఫ్ అయిపోతాయి. ఒకవేళ సిమ్ కార్డు లాక్ చేయబడితే దానిని వినియోగదారుడు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత ఏడాది గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇది సాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఉండనుంది. 2026 ఫిబ్రవరి నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది శాంసంగ్ చెందిన గెలాక్సీ మొబైల్స్ లో మాత్రమే చూడవచ్చు. మిగతా ఫోన్లలో వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular