New smartphones launching in March: 2026 కొత్త సంవత్సరం సందర్భంగా జనవరిలో చాలావరకు మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే దశలో మొబైల్స్ ఒకదాని వెంట ఒకటి మార్కెట్లోకి రాబోతున్నాయి. అయితే వాడికంటే ముందుగా Samsung కంపెనీ కొత్త సిరీస్ ను మార్కెట్లో ప్రవేశ పెట్టబోతుంది. ఇప్పటికే ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఇందులో భాగంగా కొత్త మొబైల్ మార్కెట్లోకి వస్తుందన్న సమాచారంతో కొంతమంది ఆసక్తిగా ఈ ఫోన్ గురించి తెలుసుకుంటున్నారు. ఇవే కాకుండా మరికొన్ని ఫోన్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
Samsung కంపెనీ నుంచి కొత్తగా Galaxy s26 అనే మొబైల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ మొబైల్లో 6.9 అంగుళాల OLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే నేటితరం యూత్ గేమింగ్ కోసం అనుగుణంగా ఉండనుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అనే సాఫ్ట్వేర్ ఉండడంతో మొబైల్ వేగం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగానే శాంసంగ్ ఫోన్లలో కెమెరా పనితీరు మెరుగ్గా ఉంటుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే మొబైల్ లో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. దీని ద్వారా లాంగ్ షాట్స్ కూడా క్వాలిటీగా చిత్రీకరించుకోవచ్చు. అలాగే ఇందులో ఆల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా కూడా పనిచేయనుంది. సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా అనుగుణంగా ఈ కెమెరా అద్భుతమైన పనితీరు కనపరిచే అవకాశం ఉందా అని తెలుస్తుంది.
ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ కు అనుగుణంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆదారిత సాఫ్ట్వేర్ పై పని చేసే ఈ మొబైల్ ధర రూ.87,999 గా నిర్ణయించారు. అలాగే సాంసంగ్ గెలాక్సీ 26 ప్లస్ రూ. 1,19,999 తో విక్రయించే అవకాశం ఉంది.
అలాగే Vivo కంపెనీకి చెందిన రెండు మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో ఒకటి వివో v70, వివో v70 ఎలైట్ ఉన్నాయి. ఇవి రెండు ప్రీమియం లుక్ ను అందిస్తాయి. వివో v70, వివో v7 ఎలైట్ రెండు మొబైల్స్ 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే తో ఉండనున్నాయి. ఇవి 1.5 k resolution తో పని చేస్తాయి. వీటిలో 6,500 mAh ఉండనుంది. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేస్తుంది. ఇందులో ఉండే కెమెరా 50 MP మెయిన్ కెమెరాతో పనిచేస్తుంది. వీటిలో మొదటి మొబైల్ ధర రూ.45,999 గా ఉండగా.. రెండో మొబైల్ ధర రూ.51,999 తో విక్రయించే అవకాశం ఉంది.