spot_img
Homeబిజినెస్Samsung Galaxy A57: Samsung నుంచి రెండు కొత్త మొబైల్స్.. వీటి గురించి తెలిస్తే వెంటనే...

Samsung Galaxy A57: Samsung నుంచి రెండు కొత్త మొబైల్స్.. వీటి గురించి తెలిస్తే వెంటనే కొంటానంటారు..

Samsung Galaxy A57: ప్రముఖ మొబైల్ కంపెనీ Samsung ద్వారా ఇప్పటికీ ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ ను చేర్చుకొని వినియోగదారులను ఆకర్షించే విధంగా నూతన మోడల్స్ ను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల చివరిలో సాంసంగ్ కంపెనీకి చెందిన రెండు ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటి గురించి కంపెనీ అధికారికంగా చెప్పకుండా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోన్లో ఎలా ఉండబోతున్నాయో చెప్పింది. దీంతో కొత్తగా మొబైల్ కొనే వారితో పాటు పాత మొబైల్ ను మార్చుకోవాలని అనుకునేవారు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ కంపెనీకి చెందిన ఈ రెండు ఫోన్లు ఏవి? అవి ఎలా ఉండబోతున్నాయి?

2026 మార్చి 25వ తేదీన Samsung కంపెనీ నుంచి Galaxy A57, Galaxy A37 అనే మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటి డిజైన్ ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతున్నట్లు కంపెనీ ఎక్స్ పోస్టు ద్వారా పేర్కొంది. ఇవి రెండు పనులు కి ఐలాండ్ డిజైన్ తో ఉండి ట్రిపుల్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్లో Galaxy A57 గ్రే, ఐసి బ్లూ, బ్లాక్ కలర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. A 37 మొబైల్ గ్రే గ్రీన్, చార్కోల్, లావెండర్ షేడ్స్ లో దర్శనం ఇవ్వబోతుంది. ఈ రెండు మోడళ్లు సెల్ఫీ కెమెరాను కలిగి ఉండి ఫ్లాట్ డిస్ప్లే తో కనిపిస్తాయి.

ఈ రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటాయి. ఇవి ప్యానెల్ మీద నిలువుగా అమర్చబడి కనిపిస్తాయి. వీటి దగ్గరే ఫ్లాష్ ఎల్ఈడి లైట్స్ ఉండనున్నాయి. కెమెరాలు భాగంగా 50 MP మెయిన్ కెమెరా అమర్చబడింది.12 MP ఫ్రంట్ కెమెరా తో పాటు వీడియో కాలింగ్ కోసం పని చేయనుంది.

సాంసంగ్ A 57 మొబైల్ లో 1680 చిప్ సెట్ ఉండనుంది. ఏ37 మొబైల్ లో ఎక్సినోస్ 1480 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో A 57 మొబైల్ లో 6.6 అంగుళాల HD AMOLED డిస్ప్లే కనిపిస్తుంది. A 37 మొబైల్ లో 6,7 అంగుళాల ప్యానెల్ ను కలిగి ఉంటుంది. వీటి గురించి పూర్తిగా సమాచారాన్ని సాంసంగ్ అధికారిక వెబ్సైట్ లోను చేర్చారు. అయితే ఇప్పటికే సాంసంగ్ మొబైల్స్ అంటే ఇష్టం ఉన్నవారు వీటిని ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు. రోజువారి వినియోగదారులకు మీ మొబైల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular