Samsung Galaxy F06 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు శామ్‌సంగ్ తాజాగా భారతదేశంలో తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6GB RAM, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. శామ్సంగ్ Galaxy F06 5G ని విడుదల చేసింది. కంపెనీ ప్రకారం… ఇది భారతదేశంలో లభించే అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే డిజైన్, కొత్త కెమెరా సెటప్, కలర్ ఆఫ్షన్లు, అదనపు ఫీచర్లతో వస్తుంది. Samsung Galaxy F06 5G ధర, ఫీచర్స్ స్పెషాలిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Samsung Galaxy F06 5G స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 12 5G బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు, ఇది అద్భుతమైన డౌన్‌లోడ్ వేగం, అద్భుతమైన వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ అనుభవాన్ని కూడా యూజర్లకు అందజేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల (17.13 సెం.మీ.)IPS స్క్రీన్ ఉంటుంది. HD+ రిజల్యూషన్ ను అందజేస్తుంది. ఈ స్క్రీన్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, స్మాల్ ఇంచెస్ కలిగి ఉంటుంది. దీనికి వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కూడా ఉంది. దీని వల్ల ది బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్‌సెట్, Dimensity 6300 ఉండగా, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది.
కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్ 50MP డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 2MP డెప్త్ సెన్సార్, 50MP ప్రైమరీ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌లో సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8ఎంఎం స్లీక్ బాడీతో స్టైలిష్ లుక్ ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. దీని వల్ల ఫోన్ త్వరగా చార్జ్ అవుతుంది. ఎక్కువ సమయం పనిచేస్తుంది. Samsung Galaxy F06 5G స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డివైస్‌ను త్వరగా, సురక్షితంగా అన్‌లాక్ చేయడానికి సాయపడుతుంది. ఈ ఫోన్ రెండు అద్భుతమైన కలర్స్ – బహామా బ్లూ, లిట్ వైలెట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 4 OS అప్గ్రేడ్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్‌ను అందిస్తుంది. Samsung Galaxy F06 5G కొత్త డిజైన్, శక్తివంతమైన ఫీచర్స్‌తో ఫోన్ మార్కెట్‌లోకి రాబోతుంది.
ధర ఎంత?
ఫోన్ ధర గురించి మాట్లాడుకుంటే.. శామ్సంగ్ ఈ ఫోన్ 4GB RAM వేరియంట్ ధరను రూ.9499గా నిర్ణయించింది. దాని 6GB RAM వేరియంట్ ధర రూ.10999గా నిర్ణయించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ కాకుండా.. మీరు దీన్ని ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ ఈ కొత్త ఫోన్ Moto G45 5G కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో, వినియోగదారులు 4GB, 8GB వంటి రెండు RAM ఆఫ్షన్లను పొందుతారు. 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఇందులో అందించారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటరోలా ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. అలాగే, ఇది సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.