Passenger Vehicles: ఏప్రిల్ లో తగ్గిన పాసింజర్ వాహనాల అమ్మకాలు.. కారణం ఇదే..

గతేడాది కంపేరిటివ్ బేస్ కారణంగా ఏప్రిల్‌లో ఫ్లాట్ గ్రోత్ ఏర్పడిందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పష్టం చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రభావం కూడా లేకపోలేదని వెల్లడించారు.

Written By: Neelambaram, Updated On : May 15, 2024 1:27 pm

Passenger Vehicles

Follow us on

Passenger Vehicles: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి నెలలో ప్యాసింజర్ వాహనాల (Passenger Vehicle -PV) అమ్మకాలు తగ్గాయి. ఏప్రిల్‌లో 3.38 లక్షల యూనిట్ల అమ్మకాలు జరగగా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు కొంత మేర దెబ్బతిన్నాయి. ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 1.77 శాతం పెరిగి 3,38,341 యూనిట్లకు చేరుకోగా, గతేడాది ఇదే నెలలో 3,32,468 యూనిట్లుగా ఉన్నాయి. ఈ కాలంలో మారుతీ సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ హోల్‌సేల్ అమ్మకాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది.

గతేడాది కంపేరిటివ్ బేస్ కారణంగా ఏప్రిల్‌లో ఫ్లాట్ గ్రోత్ ఏర్పడిందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పష్టం చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రభావం కూడా లేకపోలేదని వెల్లడించారు. ఈ ఏడాది ఉత్సాహంగా ప్రారంభించినట్టు పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఎన్నికల సమయంలో మార్కెట్ కాస్త మందకొడిగా ఉంటుంది కాబట్టి ఎన్నికలు పూర్తయ్యాక మార్కెట్(Passenger Vehicle) మళ్లీ పంజుకుంటుందని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.

మారుతీ సుజుకి దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు(PV) ఏప్రిల్‌లో 1,37,952 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 1,37,320 యూనిట్లుగా ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 1 శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరుకుది. గతేడాది ఇదే నెలలో 49,701 యూనిట్లు ఉన్నాయి.

ఏప్రిల్‌లో ప్యాసింజర్ వాహనాల(PV) వృద్ధి తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని హ్యుందాయ్ COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) తరుణ్ గార్గ్ తెలిపారు. రెండేళ్లలో అధిక కంపేరిటివ్ బేస్ ఎఫెక్టే దీనికి కారణమన్నారు. ఎంక్వైరీలు, బుకింగ్‌లు గతేడాది అదే స్థాయిలో ఉన్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా దృష్ట్యా గ్రామీణ విక్రయాల అంచనా బాగానే ఉందని గార్గ్ చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సహా దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో(PV) టాటా మోటార్స్ 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్‌లో అమ్మకాలు 47,883 యూనిట్లుగా ఉండగా, గతే సంవత్సరం ఇదే నెలలో 47,007 యూనిట్లుగా ఉంది. మరో వైపు, టయోటా కిర్లోస్కర్ మోటార్ హోల్‌సేల్ అమ్మకాలు ఏప్రిల్‌లో 32 శాతం పెరిగి 20,494 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది ఇదే నెలలో 15,510 యూనిట్లు. MG మోటార్, ఇండియా రిటైల్ విక్రయాలు ఏప్రిల్‌లో 1.45 శాతం తగ్గి 4,485 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్‌లో 4,551 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇక, బైక్ విభాగంలో టీవీఎస్ మోటార్ దేశీయ విక్రయాలు ఏప్రిల్‌లో 29 శాతం పెరిగి 3,01,449 యూనిట్లకు చేరుకోగా, గతేడాది ఇదే నెలలో 2,32,956 యూనిట్లుగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విక్రయాలు ఏప్రిల్‌లో 9 శాతం పెరిగి 75,038 యూనిట్లకు చేరాయి. ఇది గతేడాది ఇదే నెలలో 68,881 యూనిట్లు.