Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ఈ వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు?

Russia Ukraine War:  రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మన దేశంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం వల్ల దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో కొన్ని వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత కొన్నిరోజులలో దేశంలో వంటనూనెల ధరలు అంచనాలను మించి పెరిగిన విషయం తెలిసిందే. వంటనూనెలు ఊహించని స్థాయిలో పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. దేశంలో బంగారం, […]

Written By: Kusuma Aggunna, Updated On : March 8, 2022 4:25 pm
Follow us on

Russia Ukraine War:  రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మన దేశంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం వల్ల దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో కొన్ని వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత కొన్నిరోజులలో దేశంలో వంటనూనెల ధరలు అంచనాలను మించి పెరిగిన విషయం తెలిసిందే.

Russia Ukraine War

వంటనూనెలు ఊహించని స్థాయిలో పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు కూడా అంచనాలకు మించి పెరగడం గమనార్హం. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వార్తలు వస్తుండగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: పేదలు సినిమాను ఇప్పుడెలా చూడాలి..? టిక్కెట్ల రేట్లు ఎవరి కోసం పెంచినట్లు..?

ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహాలు, ఖనిజాల ధరలు ఊహించని స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. కార్లు, ఎలక్ట్రిక్ పరికరాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ కనిష్టానికి చేరుకుంది. వంటనూనెలు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

బొగ్గు ధర కనీవిని ఎరుగని స్థాయిలో పెరగగా అల్యూమినియం టన్ను రికార్డు ధర 3,935 డాలర్లుగా ఉండటం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు మాత్రం భారీ మొత్తంలో నష్టపోతుండటం గమనార్హం.

Also Read: సభలో కేటీఆర్, ఈటల ఆలింగనం.. వైరల్ అవుతున్న వీడియో