Royal Enfield Scram 411 : బైక్ నడపాలన్నా ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇక బుల్లెట్ బండిపై రయ్యిమని దూసుకుపోవాలని చాలా మందికి అనిపిస్తుంది. నేటి తరం యువత ఎక్కువగా ‘డుగ్గు డుగ్గు’ మంటూ పోయే బుల్లెట్ బండికే ఓటేస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ మోటార్ సైకిళ్లకు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. పెద్దవారు సైతం ఇప్పుడు ఈ బైక్ పై ఆసక్తి చూపుతు్నారు. తాజాగా బైక్ ప్రియుల కోసం ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ కంపెనీ సరికొత్త బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411’ పేరుతో దీనిని ఇటీవల రిలీజ్ చేశారు. దీంతో ఈ బైక్ రేంజ్, రైడింగ్.. విశేషాలను యూత్ తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మరి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దామా..

పురాతన బైక్ ల మోడల్ ను తీసుకురావడంలో రాయల్ ఎన్ ఫీల్డ్ ఇప్పటికే సక్సెస్ అయింది. ఇక లెటేస్ట్ ‘స్క్రామ్ 411’ ఇంచుమించుగా అలాగే కనిపిస్తోంది. స్పోర్ట్స్, డర్ట్, అడ్వెంచర్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది. మనదేశంలో స్క్రాంబర్ల టైప్ మోటార్ సైకిళ్లను కొత్తగా వింటున్నాం కావచ్చు. కానీ వీటికి వందేళ్లకు పైగానే చరిత్ర ఉండడం విశేషం. ‘స్క్రామ్ 411’ ఇండియన్ పీపుల్స్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యుత్తమ టెక్నాలజీతో పాటు సేప్టీ ఫీచర్లు, లెటేస్ట్ రైడర్ అసిస్ట్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. అయితే స్క్రాంబర్లు టైప్ మోటార్ సైకిళ్ల విషయంలో ఇప్పటికీ మారని అంశం ఏదైనా ఉంది అంటే అది వాటి స్క్రాంబర్ల డిజైన్ డీఎన్ ఏ మాత్రమే.
సాధారణంగా మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల స్క్రాంబర్ల టైప్ మోటార్ సైకిళ్లు ఒకేరకమైన డిజైన్ ను కలిగి ఉంటాయి. కానీ ‘స్క్రామ్ 411’ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో స్క్రాంబర్ల బైక్ సాధారణ డిజైన్ లక్షణాలలో గుండ్రటి హెడ్ ల్యాంప్, డర్ట్ బైక్ -స్టైల్ మడ్ గార్డ్ లు, సింగిల్ పీస్ సీటు, పెద్ద ప్యూయెల్ ట్యాంక్, అన్ రోడ్.. ఆఫ్ రోడ్ రెండింటికీ ఉపయోగపడే డ్యూయల్ పర్సన్ టైర్లు మొదలైనవి ఉన్నాయి. స్క్రాంబర్ టైప్ మోటార్ సైకిళ్లు చాలా శక్తివంతంగా, ఆధునికంగా మారాయి. తయారీదారులు కూడా వీటిని అత్యుత్తమ టెక్నాలజీ, సేప్టీ ఫీచర్లతో పాటుగా రైడర్ కు సహకరించే లేటెస్ట్ రైడర్ అసిస్ట్ ఫీచర్లతో తయారు చేస్తున్నారు.
హిమాయలన్ బైక్ ఆధారంగా చేసుకొని ‘స్క్రామ్ 411’ స్క్రాంబర్లను తయారు చేస్తారు. అయితే ఈ రెండు మోడళ్లను వేరు చేసే కొన్ని డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ ముందు భాగంలో కనిపించే గుండ్రటి హెడ్ ల్యాంప్ ఫిక్స్ యూనిట్ లా ఉంటుంది. కానీ ‘స్క్రామ్ 411’ విషయానికొస్తే ఇది ఫ్రంట్ ఫోర్కులకు అమర్చబడి ఉంటుంది. ఇంకా ఇందులో నిటారులగా ఉన్నట్లు అనిపించే హ్యాండిల్ బార్ చాలా ప్రత్యేకంగా కనిపించే సైడ్ మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఫోర్క్ గేటర్ లో ఉంటాయి.
‘స్క్రామ్ 411’ సైడ్ డిజైన్ గమనిస్తే ఫ్యూయల్ ట్యాంక్, బేర్ బోన్ బాడీ ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ చూడడానికి హిమాలయన్ మాదిరిగానే అనిపించినప్పటికీ ‘స్క్రామ్ 411’ ఫ్యూయెల్ ట్యాంక్ కి ఇరువైపులా చిన్నపాటి పొగడింపులు ఉంటాయి. ఇవి ఈ రెండింటిని వేరుగా ఉండేలా చూస్తాయి. ఇక ఇంజన్, దాసిన్, ఎగ్జాస్ట్, వెనుక చక్రం, వెనుక డిజైన్ అన్నీ కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ హియాలయన్ ను పోలి ఉంటాయి. మార్కెట్లో హిమాలయన్ బైక్ అద్భుతమైనదే.. కానీ ‘స్క్రామ్ 411’ కూడా న్యూ స్టైల్ లో వెరైటీగా కనిపిస్తుంది.
Also Read: Sajjanar Tweet About RRR: ఎత్తరజెండా పాటను కూడా వదలని సజ్జనార్.. ఇలా వాడేశాడే
ఇక కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411 ధరను కంపెనీ రూ.2.03 లక్షలుగా పేర్కొంది. అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ బైక్ ను సొంతం చేసుకోవడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు.

[…] […]