Chandrababu Royal Enfield : మొన్ననే కదా ఏపీ రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని చంద్రబాబు తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ కంపెనీ ఏపీ వచ్చిన తర్వాత వైసిపి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఏకంగా కేసులు కూడా వేయించేందుకు కోర్టు దాకా వెళ్ళింది. ఆ మధ్య గూగుల్ మీద కూడా అలానే కదా కేసులు వేయించింది. అసలు ఆ పార్టీకి ఏపీ ప్రయోజనాలు ఏ మాత్రం నచ్చవు. కేవలం విధ్వంస విధానాలు మాత్రమే ఆ పార్టీకి కావాలి. అభివృద్ధి అనేది అవసరం లేదు. ప్రజల జీవితాలు మెరుగుపడాలని కోరుకోదు. అది ఆ పార్టీ దురవస్థ. 11 స్థానాలు వచ్చినప్పటికీ ఇంకా ఆ పార్టీ మారడం లేదంటే.. భవిష్యత్తులో కూడా మారే అవకాశం లేదని అర్థమవుతుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ అనేది కుర్ర కారు మనసు దోచుకున్న బ్రాండ్. యువత ఇష్టానికి అనుగుణంగా రాయల్ ఎన్ఫీల్డ్ నిత్యం కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈ కంపెనీ అంత ఈజీగా ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టదు. పైగా దీనికి అంతర్జాతీయంగా బ్రాండ్ వ్యాల్యూ ఉంది. ఆడి రేంజ్ లో దీనికి స్థాయి ఉంది. అయితే ఇంతటి కంపెనీని ఏపీ తీసుకురావడం అంత ఈజీ కాలేదు. నారా లోకేష్ చాలా ఇబ్బంది పడ్డారు. నారా చంద్రబాబు నాయుడు అనేక మందితో మాట్లాడారు. చివరికి ఏపీకి తీసుకొచ్చారు.
ఏపీకి తీసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ మాములు బ్రాండ్ కాదు. 2026 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ రూపొందించిన బలమైన వాహన బ్రాండ్ల జాబితాలో ఇది మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాహన బ్రాండ్ గా అవతరించింది. అంతేకాదు ఆడి, ఫెరారీ వంటి బ్రాండెడ్ సైతం వెనక్కినట్టుంది. టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానంలో ఈ కంపెనీ కొనసాగుతోంది. బ్రాండ్ స్ట్రెంత్ జాబితాలో 100 పాయింట్లకు గానూ 88.6 పాయింట్లను స్కోర్ చేసింది. త్రిబుల్ ఎ రేటింగ్ సాధించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఏకంగా మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రఖ్యాత ఆడి కంపెనీకి నాలుగవ స్థానం, ఫెరారీ కంపెనీకి ఏడో స్థానం లభించాయి. మన దేశానికి చెందిన టాటా మోటార్స్ కంపెనీకి ఐదవ స్థానం దక్కింది. మారుతి సుజుకి ఆరవ స్థానం, మహీంద్రా అండ్ మహీంద్రా 8వ స్థానం, హీరో మోటో కార్ప్ 10వ స్థానం సంపాదించాయి.
అంతర్జాతీయంగా 10 బలమైన వాహన కంపెనీలలో మన దేశం నుంచి దాదాపు ఐదు కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 80 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అంతర్జాతీయంగా ఈ బ్రాండ్ విశేషమైన ఆదరణ దక్కించుకున్నది. టయోటా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా అవతరించింది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. హైయెస్ట్ వాల్యూ ఉన్న 10 వాహన బ్రాండ్లలో ఇండియా నుంచి ఏ కంపెనీ కూడా స్థానం దక్కించుకోకపోవడం విశేషం.