https://oktelugu.com/

మోడీకి షాక్ లగా.. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే

ఇన్నాళ్లు పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయిన మోడీ సర్కార్ ముందరి కాళ్లకు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. కేంద్రంలో బలం ఉండడంతో మోడీ సర్కార్ రైతులకు శరాఘాతంగా మారిన వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. వాటి అమలుకు రెడీ అయ్యింది. అయితే పంజాబ్, హర్యానా రైతులంతా ఢిల్లీకి తరలివచ్చి రెండు నెలలుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మోడీ సర్కార్ తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ఆందోళనలు కొన్ని రోజులుగా చేస్తున్నారు. Also Read: హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణమేంటంటే..? […]

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2021 / 06:49 PM IST
    Follow us on

    ఇన్నాళ్లు పట్టపగ్గాల్లేకుండా రెచ్చిపోయిన మోడీ సర్కార్ ముందరి కాళ్లకు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. కేంద్రంలో బలం ఉండడంతో మోడీ సర్కార్ రైతులకు శరాఘాతంగా మారిన వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. వాటి అమలుకు రెడీ అయ్యింది. అయితే పంజాబ్, హర్యానా రైతులంతా ఢిల్లీకి తరలివచ్చి రెండు నెలలుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మోడీ సర్కార్ తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ ఆందోళనలు కొన్ని రోజులుగా చేస్తున్నారు.

    Also Read: హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణమేంటంటే..?

    వణికించే చలిలో నెలలుగా రైతులు అష్టకష్టాలు పడి అన్ని కష్టాలు తట్టుకుంటూ ఉసురు తీసుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ సంఘాలతో కేంద్రప్రభుత్వం పలుమార్లు సంప్రదింపులు జరిపినా అనేక దఫాలుగా చర్చలు జరిపినా రైతుల వెనక్కితగ్గలేదు.

    ఈ క్రమంలో సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. విసిగి వేసారిన సుప్రీం కోర్టు నిన్న కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు వ్యవసాయ చట్టాలపై ఏకంగా స్టే ఇచ్చింది సంచలనం సృష్టించింది. కేంద్రంలోని బీజేసీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చింది.

    Also Read: చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. పెరుగుతున్న కేసులు..?

    కేంద్రప్రభుత్వం ఆమోదించే చట్టాలను ఆపే హక్కు సుప్రీంకోర్టుకు లేదని మేధావులు అంటున్నా అత్యున్నత న్యాయస్థానం మాత్రం సంచలన నిర్ణయం తసీుకొని వ్యవసాయ చట్టాలను నిలుపుదల చేయడం వివేషం. సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. రైతులతో కమిటీ సంప్రదింపులు జరిపి ప్రభుత్వంతో సంప్రదించి సమస్య పరిష్కరించాలని సూచించింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్