Renault : రెనాల్ట్ కంపెనీ రాబోయే మూడేళ్లలో భారతీయ వినియోగదారుల కోసం ఏకంగా ఐదు కొత్త కార్లను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. తొలుత రెండు నెక్స్ట్ జనరేషన్ కార్లను రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత రెనాల్ట్ కంపెనీ కొత్త ప్లాట్ ఫామ్ పై తయారవుతున్న రెండు సరికొత్త SUVలను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇక చివరగా తమ మొదటి ఎలక్ట్రిక్ కారును కూడా రిలీజ్ చేయనుంది. భారతీయ మార్కెట్‌లో తమ పట్టు మరింత బలోపేతం చేసుకోవడానికి రెనాల్ట్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్యాసింజర్ వాహన విభాగంలో 5 శాతం మార్కెట్ షేర్‌ను సాధించాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది.
Also Read : తక్కువ ధరలో కొత్త లుక్ లో రెనాల్ట్ కైగర్.. మార్కెట్ కొల్లగొట్టడం ఖాయం
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెక్ట్స్ జనరేషన్ మోడల్స్, కొత్త మోడల్స్ ను ఏప్రిల్ 2025 నుంచి ఏప్రిల్ 2027 మధ్య వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుున్నారు. కొత్త ఎలక్ట్రిక్ కార్లతో పాటు, కంపెనీ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ కలిగిన మోడళ్లపై కూడా పనిచేస్తోంది. 2025లో రెనాల్ట్ కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే 7 కార్లను విడుదల చేసింది. గతేడాది అంటే 2024లో కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో 12 కొత్త కార్లను విడుదల చేసింది.
ఈ కొత్త వ్యూహానికి ‘Renault.Rethink’ అని పేరు పెట్టింది. కంపెనీ కొత్త బ్రాండ్ గుర్తింపును తిరిగి రూపొందించేందుకు కృషి చేస్తుంది. కమ్యూనికేషన్, టచ్‌పాయింట్స్, మోడల్స్‌ను కొత్తగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీని కోసం కంపెనీ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టాలని భావిస్తోంది.
చెన్నైలో కంపెనీ మొదటి డిజైన్ స్టూడియోను ప్రారంభించినట్లు కూడా రెనాల్ట్ ప్రకటించింది. ఫ్రాన్స్ వెలుపల ఉన్న కంపెనీ అతిపెద్ద డిజైన్ స్టూడియో. కంపెనీ తయారీ కర్మాగారం ఉత్పత్తి కెపాసిటీ 4.8 లక్షల యూనిట్లు. ఇందులో దేశీయ, ఎగుమతులు కూడా ఉన్నాయి. ఈ కొత్త డిజైన్ స్టూడియో భారతీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం కొత్త మోడళ్లను రూపొందించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.
రెనాల్ట్ క్విడ్ కు 10 ఏళ్లు
రెనాల్ట్ ఈ హ్యాచ్‌బ్యాక్ వినియోగదారులలో చాలా పాపులర్. ఈ కారు ధర రూ. 4.70లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు 1.0 లీటర్ త్రీ సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5500rpm వద్ద 68bhp పవర్, 92.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. క్విడ్ తన సరసమైన ధర, మంచి ఫీచర్ల కారణంగా భారతీయ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Also Read : నిస్సాన్ కిక్స్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్..సేఫ్టీలో దుమ్మురేపిన ఎస్యూవీ !