Crossover Cars : క్రాస్ ఓవర్ కార్ల కోసం ఎగబడుతున్నారు..డిజైన్ చూసి షాక్.. ఎందుకో తెలుసా? ధరలు ఎలా ఉన్నాయంటే?

SUV, సెడాన్ కార్ల మిశ్రమమే క్రాస్ ఓవర్ కార్లు. అయితే ఎస్ యూవీల ఈ కార్లు విశాలమైన స్పేస్ ను కలిగి ఉండవు. కానీ అధునాతన ఫీచర్లు కలిగి ఉంటాయి. ఆ రెండు కార్లలో ఉండే ఫీచర్లతో పాటు కొత్త కొత్తవి కూడా చూడొచ్చు. ఈ క్రాస్ ఓవర్ కార్లపై డ్రైవింగ్ చేస్తే కొత్త అనుభూతిని పొందుతారు. ఇవి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. కానీ ఇటీవల భారత్ లో క్రాస్ ఓవర్ కార్ల కోసం ఎగబడుతున్నారు.

Written By: NARESH, Updated On : July 15, 2024 1:14 pm
Follow us on

Crossover Cars : భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ తరుణంలో కార్ల కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణంగా కొన్ని కంపెనీలు హ్యాచ్ బ్యాక్ లపై దృష్టి పెడితే.. మరికొన్ని SUV వేరియంట్ ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని కొనసాగిస్తాయి. అయితే లేటేస్టుగా కొన్ని కంపెనీలు క్రాస్ ఓవర్ కార్లపై ఫోకస్ చేస్తున్నారు. కార్ల వినియోగదారుల్లో చాలా మంది కొత్త డిజైన్ ను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓవర్ కార్లను చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇవి హ్యాచ్ బ్యాక్ కు తక్కువ కాకుండా.. ఎస్ యూవీలకు ఎక్కువ కాకుండా విభిన్న మోడల్ ను కలిగి ఉంటాయి. క్రాస్ ఓవర్ కార్ల వల్ల కొత్త అనుభూతిని పొందడమే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది కార్ల ప్రతినిధులు అంటున్నారు. అసలు క్రాస్ ఓవర్ కార్లు అంటే ఏమిటి? వీటికి ఎందుకు డిమాండ్ ఉంటున్నాయి?

SUV, సెడాన్ కార్ల మిశ్రమమే క్రాస్ ఓవర్ కార్లు. అయితే ఎస్ యూవీల ఈ కార్లు విశాలమైన స్పేస్ ను కలిగి ఉండవు. కానీ అధునాతన ఫీచర్లు కలిగి ఉంటాయి. ఆ రెండు కార్లలో ఉండే ఫీచర్లతో పాటు కొత్త కొత్తవి కూడా చూడొచ్చు. ఈ క్రాస్ ఓవర్ కార్లపై డ్రైవింగ్ చేస్తే కొత్త అనుభూతిని పొందుతారు. ఇవి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. కానీ ఇటీవల భారత్ లో క్రాస్ ఓవర్ కార్ల కోసం ఎగబడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ మోడలళ్లలో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా సెడాన్ వలె ఫైనాన్స్ ప్రావిట్స్ ఉండనున్నాయి.

భారత్ లో కొన్ని క్రాస్ ఓవర్ కార్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మారుతి సుజుకీ కంపెనీకి చెందిన ‘S క్రాస్’.. ఇది 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో కూడి ఉంది. 89 బీహెచ్ పీ పవర్, 200 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఇది లాంగ్ డ్రైవ్ చేసేవారికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దీనిని రూ.8 లక్షల నుంచి రూ. 12.07 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

క్రాస్ ఓవర్ లో మరో కారు ‘డాట్సన్ రెడి-GO’. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. 0.8 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 బీహెచ్ పీ పవర్, 91 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ విండోన్, తో పాటు రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేక్ ఉన్నాయి. దీనిని రూ.3.83 లక్షల నుంచి రూ.4.98 లక్షల వరకు విక్రయించనున్నారు.

హోండా WR-V కూడా క్రాస్ ఓవర్ కారుగా ప్రసిద్ధిం చెందింది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉండి సాఫీగా ప్రయాణం చేసేలా చేస్తుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కలిగిన ఈ మోడల్ ను రూ. 8 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.

ఇవే కాకుండా మరిన్ని క్రాస్ ఓవర్ కార్లు మార్కెట్లో అలరిస్తున్నాయి. ఇవి సాధారణ కార్ల కంటే బలమైన వాటిగా నిర్మీతమవుతాయి. ఒకే వాహనంలో రెండు వేరియంట్ల లక్షణాలు పొందలనుకువారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా పేర్కొంటున్నారు.