Renault : ఒకప్పుడు డస్టర్‌తో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను ఊపేసిన ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ మళ్లీ భారత మార్కెట్‌పై కన్నేసింది. ఇప్పుడు ఏకంగా ఐదు కొత్త కార్లను విడుదల చేసి ఇక్కడ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఇటీవల రెనాల్ట్ ప్రకటించిన కొత్త వ్యూహం ప్రకారం.. ఒకప్పుడు ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన డస్టర్‌ను సరికొత్త రూపంలో తిరిగి తీసుకురానుంది. అంతేకాదు, ఏకంగా 7 సీటర్ ఎస్‌యూవీని కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
ఈ 7 సీటర్ ఎస్‌యూవీని రెనాల్ట్ తన CMF-B గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై థర్డ్ జనరేషన్ డస్టర్‌ను కూడా తయారు చేయనున్నారు. అయితే, ఈ ఎస్యూవీ భారతీయ వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా అనేక మార్పులతో రాబోతుంది. ముఖ్యంగా ఇంటీరియర్ పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. రెనాల్ట్ ఈ 7 సీటర్ ఎస్యూవీ పేరును కూడా వెల్లడించింది – దాని పేరు ‘బోరియల్’. ఈ ఎస్యూవీ మొదట లాటిన్ అమెరికా మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత 70కి పైగా దేశాలకు విస్తరించనుంది. ‘బోరియల్’ అనే పేరు ఫ్రెంచ్ భాష నుండి వచ్చింది. ఇది కంపెనీ మూలాలను సూచిస్తుంది.
Also Read : ఇక స్విఫ్ట్, బ్రెజ్జాకు చుక్కలే.. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!
రెనాల్ట్ ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఒక టీజర్ చిత్రాన్ని కూడా విడుదల చేసింది. దాని టెయిల్‌గేట్‌పై కంపెనీ కొత్త లోగో కూడా కనిపిస్తోంది. అయితే, ఈ 7 సీటర్ ఎస్యూవీ గురించి రెనాల్ట్ మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రెనో భాగస్వమీ సంస్థ అయిన నిస్సాన్ కూడా ఇదే ఎస్యూవీ తమ వెర్షన్‌ను విడుదల చేయనుంది. అయితే దాని డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బోరియల్ భారతదేశంలో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ ఎస్యూవీ హైబ్రిడ్ ఇంజన్‌తో రానుంది. డిజైన్ పరంగా చూస్తే.. CMF-B ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన బోరియల్ ఎస్యూవీ చాలా వరకు బిగ్‌స్టర్ కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. దీని ముందు భాగంలో Y- ఆకారపు LED హెడ్లైట్లు ఉన్నాయి. ఇవి కొత్త డస్టర్‌ను గుర్తు చేస్తాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.6-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ , 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండవచ్చు. రెనాల్ట్ ఇటీవల భారతీయ మార్కెట్ కోసం ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌పై పనిచేస్తున్నట్లు అంగీకరించింది. ఇది డస్టర్‌తో పాటు బోరియల్లో కూడా చేర్చబడవచ్చు. డస్టర్లాగే బోరియల్లో కూడా ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ అందుబాటులో ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లు ఆటో, స్నో, మడ్/సాండ్, ఆఫ్-రోడ్, ఎకో వంటి టెర్రైన్ మోడ్లతో వస్తాయి.
ఈ రాబోయే ఎస్యూవీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో మొబైల్ ఫోన్ మౌంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అద్భుతమైన ఆడియో ఎక్స్ పీరియన్స్ కోసం ప్రీమియం 6-స్పీకర్ ఆర్కామిస్ 3D సౌండ్ సిస్టమ్ వంటివి ఉండనున్నాయి. దీని ఇంటీరియర్ చాలా ఆధునికంగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో 3-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. మధ్యలో 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది.