MG Motors- Reliance: భారత్ లో గత కొంతకాలం నుంచి కార్ల తయారీ నిర్వహిస్తున్న ఎంజీ మోటార్స్ వైదొలగేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో దేశీయ మార్కెట్ వర్గాల్లో కలకలం చెలరేగింది. బ్రిటిష్ కార్ల తయారీ బ్రాండ్, చైనా ఆటో జాయింట్ ఎస్ ఏఐసి యాజమాన్యంలో ఎంజి మోటార్స్ ఇండియా పనిచేస్తున్నది. అయితే ఈ సంస్థలో మెజారిటీ వాటా వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సన్నాహాలు జరుగుతుండగానే ఇందులోకి రిలయన్స్ ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు హీరో మోటార్ కార్ కూడా చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మధ్యలో అజీమ్ ప్రేమ్ జీ కి చెందిన ఇన్ వెస్ట్, జె ఎస్ డబ్ల్యూ గ్రూప్ తో కూడా ఎంజి మోటార్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సరిహద్దుల్లో వివాదాల నేపథ్యంలో
ఈమధ్య భారతదేశంతో సరిహద్దులకు సంబంధించి చైనా తరచూ వివాదాలకు దిగుతుండడంతో ఇరుదేశాల మధ్య అంతర్గత సంబంధాలకు బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విధానాలను భారత్ నేరుగా ఎండ గడుతోంది. అంతేకాదు చైనాతో ఢీ అంటే ఢీ అంటున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్లో పెట్టుబడులు పట్టేందుకు ఎంజి మోటార్స్ ఇండియా యాజమాన్య సంస్థ ఎస్ ఏ ఐ సీ కి రెగ్యులేటరీ పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తన తదుపరి అభివృద్ధి కోసం స్థానికంగా ఉన్న భాగస్వాములని జత చేసుకోవాలని ఎంజి మోటార్స్ ఇండియా భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ కోసం ఐదు వేల కోట్ల పెట్టుబడులు తక్షణ అవసరం.
ఎడతెగని సంప్రదింపులు
భారతదేశంలో తన కంపెనీ అభివృద్ధి, నిధుల లభ్యత కోసం ఎంజి మోటార్స్ ఇండియా స్థానికంగా ఉన్న కంపెనీలతో ఏడ తెగని సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి కల్లా ఏదో ఒక ఒప్పందం ఖరారు కావచ్చని తెలుస్తోంది. అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎంజి మోటార్స్ ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ ముఖేష్ అంబానీ సొంత రాష్ట్రం. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్ల తయారీ యూనిట్ కి ఎంజి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 5000 కోట్లు కావాలి. ఈ యూనిట్ ద్వారా సుమారు 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఎలాగో ఎంజి మోటార్స్ నమ్మకమైన భాగస్వామి కావాలి, అందునా గుజరాత్ తన సొంత రాష్ట్రం కావడంతో ముకేశ్ అంబానీ ఎంజి మోటార్స్ లో పెట్టుబడులు పెట్టొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బరిలో కార్పొరేట్ దిగ్గజాలు
మరోవైపు విప్రో అజీమ్ ప్రేమ్ జీ, జె ఎస్ డబ్ల్యూ, హీరో మోటార్ కార్ సంస్థలు కూడా ఎంజి మోటార్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు దలాల్ స్ట్రీట్ అంచనా. ఎందుకంటే ఈ మూడు కంపెనీలు కూడా భారత్లో పేరు మోసిన కార్పొరేట్ దిగ్గజాలు. విప్రో, జెఎస్ డబ్ల్యూ ఎప్పటినుంచో ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నాయి. హీరో మోటార్ కార్పుకు ఆటోమొబైల్ రంగంలో విశేషమైన అనుభవం ఉంది. ఒకవేళ ముఖేష్ అంబానీ వెనకడుగు వేస్తే ఈ మూడు సంస్థలు సంయుక్త భాగస్వామ్యంలో ఎంజి మోటార్స్ ను కైవసం చేసుకోవాలని అనుకుంటున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Reliance in race for share of mg motors india business
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com