Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh First Glimpse: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో జగన్ పై...

Ustaad Bhagat Singh First Glimpse: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో జగన్ పై పవన్ అదిరిపోయే సెటైర్

Ustaad Bhagat Singh First Glimpse: పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో దేశభక్తి స్పష్టంగా కనిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి ఆయన తన సినిమాల్లో ఆ తరహా కంటెంట్, సాంగ్స్ ఉండేలా చూసుకునేవాడు. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తుంది. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. వైసీపీ ప్రభుత్వానికి ఆయన చుక్కలు చూపిస్తున్నారు. సీఎం పీఠం అధిరోహించి మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో అధికారిక వైసీపీ వైఫల్యాలను తన సినిమా ద్వారా ఎండగడుతున్నారు.

నేడు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ విడుదలైంది. కేవలం నిమిషం నిడివి కలిగిన టీజర్లో సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేశారు. దుర్మార్గం హద్దులు దాటినప్పుడు భగవంతుడు అవతరిస్తాడనే భగవద్గీత శ్లోకంతో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ మొదలైంది. పరోక్షంగా ఆయన ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తుందని చెప్పారు. అలాగే టీజర్లో రెండు సార్లు జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ చూపించారు.

గ్లిమ్ప్స్ చివర్లో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి పెర్ఫార్మన్స్ మాములుగా ఉండదని చెప్పారు. అది నేరుగా వైసీపీ ప్రభుత్వానికి ఆయన పంపిన హెచ్చరిక అనుకోవచ్చు. 2019 వైఫల్యాల నుండి చాలా నేర్చుకున్నాం. 2024లో గట్టిగా కొట్టబోతున్నాం, కాచుకోండని పవన్ చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ లో చెప్పిన వన్ లైనర్స్ నేరుగా వైసీపీ నేతలను తాకాయి. పవన్ కళ్యాణ్ విశ్వాసం చూస్తుంటే జనసేన అద్భుతం చేయడం ఖాయమని పిస్తుంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రాగా మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. 11 ఏళ్ల తర్వాత హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబో సాకారమైంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular