Reliance Disney Merger: జియో సినిమా, హాట్ స్టార్ విలీనం వల్ల దేశ మీడియా రంగంలోనే సంచలనం నమోదు అవుతుందని.. ఇకపై వినోద పరిశ్రమ మొత్తం ముకేశ్ అంబానీ చేతుల్లోకి వెళుతుందని అందరూ అనుకున్నారు. ఇల్లు అలకగానే పండగ కానట్టు.. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలినం జరిగినప్పటికీ.. దానికి ప్రారంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జియో సినిమాలోని మొదటి పేరైన జియోను, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చివరి పేరైన స్టార్ ను కలిపి జియో స్టార్ పేరుతో ఓటీటీ వేదికను తీసుకురావాలని రెండు సంస్థల యాజమాన్యాలు భావించాయి. అయితే అది అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ జియో హాట్ స్టార్ పేరుతో ఓ వ్యక్తి డొమైన్ రిజిస్టర్ చేయించుకున్నాడు. అది ముకేశ్ అంబానీ, వాల్ట్ డిస్నీ యాజమాన్యాలకు ఇవ్వాలంటే.. తనకు కోటి రూపాయలు చెల్లించాలని ప్రతిపాదన తీసుకొచ్చాడు. అలా వచ్చిన కోటి రూపాయలతో తాను కేం బ్రిడ్జిలో చదువుకుంటానని చెప్పాడు. దానికి ముఖేష్ అంబానీ, వాల్ట్ డిస్నీ యాజమాన్యం ఒప్పుకోలేదు. పైగా ఆ వ్యక్తి ఒక బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ” నాకు గొప్పగా చదువుకోవాలని ఉంది. కేం బ్రిడ్జిలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఉంది. దీనికి కోటి దాకా ఖర్చవుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ దీనికయ్యే ఖర్చు మొత్తం భరించాలని నేను కోరుతున్నానని” ఆ వ్యక్తి సోషల్ మీడియాలో కోరాడు. అయితే అలా కోటి రూపాయలు ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ తిరస్కరించిన నేపథ్యంలో.. ఆ డిమాండ్ డెవలప్ చేసిన వ్యక్తి జైనం, జీవికా అనే తన తోబుట్టువులకు విక్రయించాడు.. జైనం, జీవిక ఆ డొమైన్ ను విక్రయించబోమని స్పష్టం చేశారు..” ఇది మా సేవా ప్రయాణం మాత్రమే.
ఈ డోమైన్ ను విక్రయించబోమని” పేర్కొన్నారు.” ఇటీవల ఆ డొమైన్ కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు.. అయితే ఆ వచ్చిన ఆ మెయిల్స్ సరైనవో కావు మేము చెక్ చేయలేదు. అయితే వాటిలో కొన్నింటికి మేము ఫోన్ చేశాం. అందులో చాలా వరకు ఫేక్ ఉన్నట్టు తెలిసింది.. కొందరు భారీగానే డబ్బు ఆఫర్ చేశారు. ఆయనప్పటికీ మేము ఆ డొమైన్ విక్రయించాలని అనుకోవడంలేదని” జైనం, జీవిక వెల్లడించారు. అయితే ఇదే క్రమంలో జైనం, జీవిక ఆ డొమైన్ ను టీం రిలయన్స్ కు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జియో హాట్ స్టార్ వెబ్ సైట్
జియో స్టార్ ఓటీటి కాకుండా..
జియో హాట్ స్టార్. కామ్ వెబ్ సైట్ ద్వారా ప్రసారాలను అందించే ఆలోచనను రిలయన్స్, వాల్ట్ డిస్నీ చేస్తున్నాయి. అయితే ఈ వెబ్ సైట్ త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా రిలయన్స్, వాల్ట్ డిస్నీ ప్రకటన చేస్తాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే జియో స్టార్ వెబ్ సైట్ వెబ్ పేజీలో కంటెంట్ లేదా లింక్ లు ఇవ్వకపోవడం విశేషం. అయితే జియో హాట్ స్టార్ డొమైన్ పేరుపై నిన్నటి వరకు వివాదం సాగింది. అయితే ఆ డొమైన్ ను రిలయన్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా రిలయన్స్ రూపాయి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. పైగా ఆ డొమైన్ కొనుగోలు చేసే అవసరం కూడా లేదని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా చూస్తే డొమైన్ ఉచితంగా లభించే అవకాశం ఉన్నప్పటికీ..వెబ్ సైట్ ద్వారా ప్రసారాలు (ఓటీటీ) అందిస్తామని రిలయన్స్ చెబుతుండడం విశేషం.