https://oktelugu.com/

Crime News : చేసేదేమో సీసీ కెమెరా టెక్నీషియన్ ఉద్యోగం.. చూసేదేమో ఆ దృశ్యాలను.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

అతని పేరు శేషు.. పేరుకు తగ్గట్టుగానే అతడిది విషపూరితమైన వ్యక్తిత్వం. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసే తత్వం. అతడి వ్యవహార శైలికి తగ్గట్టుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే టెక్నీషియన్ ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అతడు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం మొదలుపెట్టాడు.. ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగు చూసాయి

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 04:08 PM IST

    CC Camera Technician

    Follow us on

    Crime News :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లోపల ఇటీవల బోరుగడ్డ అనిల్ కు పోలీసులు పరుపు, దిండు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.. అంతేకాదు అనిల్ మేనల్లుడు(మైనర్) ను పోలీస్ స్టేషన్ లోపలికి పిలిపించిన దృశ్యాలు కూడా కలకలం కలిగించాయి.. అయితే ఇవి బయటికి ఎలా వచ్చాయనేది పోలీసులకు అంతుపట్టలేదు.. సహజంగానే ఇవి అధికార కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. అయితే ఈ విషయాలను లోతుగా దర్యాప్తు చేయగా పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెలుగు చూసాయి..

    ఇలా బయటపడింది

    సీసీ కెమెరా దృశ్యాలు బయటికి వెళ్లడం పోలీసులకు షాక్ కలిగించింది. దీంతో వారు లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.. ఆధ్వర్యంలోనే శేషు పేరు వెలుగులోకి వచ్చింది. శేషు గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే వాటికి సంబంధించిన యాక్సిస్ తన వద్ద పెట్టుకున్నాడు. ఇటీవల బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చినప్పుడు.. ఆ దృశ్యాలను శేషు కెమెరామెన్ వంశీ అనే వ్యక్తి ద్వారా పత్రిక విలేకరి అరుణ్ కు అందించినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. కేవలం ఈ పోలీస్ స్టేషన్ మాత్రమే కాకుండా రిటైర్డ్ ఆర్ఎస్ఐ కి సంబంధించిన ఫామ్ హౌస్, ఓ స్పా కేంద్రం, ఇలా మొత్తం 13 చోట్ల ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల యాక్సెస్ శేషు మొబైల్ లో ఉండడం చూసి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. శేషు తన టెక్నీషియన్ ఉద్యోగాన్ని అడ్డంగా పెట్టుకొని సిసి పుటేజీల యాక్సెస్ పొందాడు.. ఓ టీవీ ఛానల్ కెమెరామెన్ వంశీ, వదిన పత్రికలో విలేకరిగా పనిచేసే అరుణ్ పై గుంటూరు పోలీసులు కేసుల నమోదు చేశారు. వంశీని విచారణ నిమిత్తం పోలీసులు పిలిపించి 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు.. శేషు స్వస్థలం గుంటూరు. అతడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. కస్టమర్ల ఆర్డర్ల మేరకు పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటాడు. అది మొత్తం పూర్తయిన తర్వాత యూజర్ ఐడి, పాస్ వర్డ్ వంటివి కస్టమర్లకు ఇవ్వాల్సి ఉండగా.. తన వద్దే పెట్టుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా పుటేజీ లో ఉన్న వీడియోలను దొంగ చాటుగా చూడడం మొదలుపెట్టాడు. అయితే ఇందులో కొన్ని అభ్యంతర దృశ్యాలు కూడా ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దృశ్యాలను అడ్డం పెట్టుకొని కొంతమందిని బెదిరించి డబ్బులు లాగినట్టు తెలుస్తోంది. ఇందులో శేషు తోపాటు అరుణ్, వంశీ కూడా తమ వంతు పాత్ర పోషించే వారిని తెలుస్తోంది.

    లోతుగా దర్యాప్తు చేసేసరికి..

    ఇటీవల బోరు గడ్డ అనిల్ కు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో పోలీసులు కల్పించిన సౌకర్యాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టాయి. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో.. హోం మంత్రి అనిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి … లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇందులో శేషు పాత్ర ప్రముఖంగా కనిపించడంతో అతనిపై కేసులు నమోదు చేశారు. శేషు వ్యవహార శైలి ఒకసారిగా బయటికి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, వాటి ఫుటేజీలను ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.