spot_img
Homeబిజినెస్Redmi Note 16 Series: అప్డేట్ బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చిన రెడ్మీ నోట్ ఫోన్.. ధర...

Redmi Note 16 Series: అప్డేట్ బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చిన రెడ్మీ నోట్ ఫోన్.. ధర తెలిస్తే వెంటనే కొంటారు..

Redmi Note 16 Series: Redmi note కంపెనీ నుంచి ఇప్పటికే ప్రో 5జి, ప్రో ప్లస్ 5G మొబైల్స్ ను ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ చేసి వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు చైనా టెక్స్ సంస్థ కొత్తగా 16 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో విశేషమేంటంటే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీతో రోజువారీ వినియోగదారులతో పాటు గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో స్టోరేజ్ కూడా అధికంగానే ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ లో ఉండే ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Redmi note 16 సిరీస్ కొత్తగా అప్డేట్ చేసుకొని మార్కెట్లోకి రాబోతుంది. ఇలా రాబోతున్న మొబైల్ లో 6.8 టు అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే 3200 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో Qualcomm మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంచారు. 8జిబి నుంచి 16 జిబి వరకు సపోర్ట్ చేసే రామ్, 1టిబి వరకు స్టోరేజ్ అయ్యే విధంగా సెట్ చేశారు. ఆండ్రాయిడ్ 15 లేదా 16 ఆధారిత ఈ మొబైల్ లో కెమెరా పని తీరు ప్రత్యేకంగా పనిచేయనుంది. ఇందులో 200 MP మెయిన్ కెమెరా అమర్చారు.8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా సపోర్ట్ గా ఉండనుంది. సోషల్ మీడియాలో కంటెంట్ సృష్టించే వారికి కూడా ఇది సపోర్టుగా ఉండనుంది.

అలాగే ఈ మొబైల్ లో 10,000 mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అయితే ఈ ఏడాది జనవరి 29న భారతదేశంలో 6,500 mAh బ్యాటరీతో దీనిని ప్రారంభించారు. కానీ ఇప్పుడు దీనిని 1000 mAh కు అప్డేట్ చేశారు. దీంతో గేమింగ్ కోరుకునేవారు లేదా బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోజువారి వినియోగదారులకు కూడా ఎక్కువసేపు బ్యాటరీ ఉండే విధంగా చేస్తుంది. ఇప్పటివరకు మార్కెట్లో రిలీజ్ అయిన రెడ్మీ 15 ప్రో ప్లస్ ఫైవ్ జి మొబైల్ ధర రూ.37,999 ప్రారంభం తర్వాత విక్రయిస్తున్నారు. ఇప్పుడు 16 ప్రో కూడా ఇంచుమించు అదే ధరతో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version