Nara Lokesh: కరువు సీమలో వెలుగులు నింపిన చరిత్ర రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుది( rural development trust). దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలోని లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపింది. అటువంటి ట్రస్ట్ మనుగడపై గత నీలి నీడలు అలుముకున్నాయి. ఎఫ్ సి ఆర్ ఏ అనుమతులు లభించక విదేశీ నిధులు నిలిచిపోయాయి. ఆ సమస్త సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి తరుణంలో మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారు. ఆయన చొరవతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు కొత్త ఆశలు చిగురించాయి. లోకేష్ ప్రయత్నం ఫలించింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిలబడగలిగింది.
* అసాధారణ సేవలు..
కరువు సీమలో ఆర్టిడి అంటే కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. పేదల బతుకులు ఆశా కిరణం. అనంతపురం( Ananthapuram) జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి,, కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల సాధికారతకు చాలా కృషి చేసింది. దశాబ్దాల కిందట చిన్న ఆశయంతో మొదలైన ఈ సంస్థ నేడు లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ.. దేశంలోనే అత్యంత ప్రభావంతమైన స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. వైద్యం, విద్య,, మహిళా సాధికారత, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసాధారణం.
* సేవల పునరుద్ధరణ..
అయితే ఇటీవల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు నిలిచిపోయాయి. ఎఫ్ సి ఆర్ ఏ( fcra ) అనుమతులు రద్దు రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. దీంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఎదురయింది. ఈ పరిణామంతో రాయలసీమలోని వేలాది పేద కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించారు. ట్రస్ట్ పారదర్శకమైన సేవలను పరిగణలోకి తీసుకొని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఆర్ ఏ రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించింది. దీంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మళ్లీ నిధులను సేకరించి సేవా కార్యక్రమాలను ఆటంకం లేకుండా కొనసాగించే అవకాశం దక్కింది. అయితే ఈ ట్రస్ట్ సేవలను పునరుద్ధరించడంలో మంత్రి లోకేష్ చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటోంది.
