Homeబిజినెస్Redmi 15A 5G price and specifications: త్వరలో కొత్త Redmi ఫోన్.. ఇప్పటివరకు ఉన్న...

Redmi 15A 5G price and specifications: త్వరలో కొత్త Redmi ఫోన్.. ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ మొబైల్స్ కు చుక్కలే..

Redmi 15A 5G price and specifications: మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్స్ కొనాలని అనుకుంటే ఎక్కువగా Xiaomi కంపెనీకి చెందిన Redmi మొబైల్స్ వైపే చూస్తాను. ఈ ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్త తరం వినియోగదారులను ఆకట్టు కొడుతుంది. ఇప్పటికే ఎన్నో మోడల్స్ మార్కెట్ లోకి వచ్చినా ఇప్పటి తరం వారిని అలోచించేందుకు కొత్త ఫోన్ తీసుకురాబోతోంది. ఈనెల 27వ తేదీన రెడ్మీ నుంచి 15 A 5G మొబైల్ రిలీజ్ చేయనుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ పరోక్షంగా హింట్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా డిజైన్తో కూడుకొని ఉంది. ధర కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుపుతోంది. మరి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Redmi 15 A 5G మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.9 అంగుళాల LCD స్క్రీన్ ఉండనుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.ఫుల్ HD+డిస్ప్లే తో పనిచేసే దీని రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ గా ఉండనుంది. దీంతో మూవీస్ చూసేవారితో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో Qualcomm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా ఉపయోగపడే అవకాశం ఉంది.

Also Read: Samsung నుంచి రెండు కొత్త మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే క్యూ కడుతారు..

ఇందులో బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. సిలికాన్ కార్బన్ తో తయారైన ఈ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18 వాట్ రివర్స్ ఛార్జింగ్ తో పని చేయనుంది. ఇందులో 6 GB నుంచి 8 GB వరకు రామ్ ఉండగా..128 GB నుంచి 256 స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఇందులో కావలసిన ఫోటోలు, వీడియోలతో పాటు ఫైల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. షావోమి హైపర్ OS 2 సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ఇందులో డాల్ఫి ఆడియో, కింది భాగంలో లౌడ్ స్పీకర్ ఉండనున్నాయి. అలాగే దీనిని రూ.16,499 ప్రారంభరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ ఫోన్ల విక్రయాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందించే ఈ ఫోన్ పై ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version