Redmi 13 5G : ప్రముఖ చైనా కంపెనీ షియోమీ వార్షికోత్సవం సందర్భంగా మరింత ఉత్సాహంగా ఉంది. 10 వార్షికోత్సవంలో భాగంగా వివిధ మోడల్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే రిలీజ్ చేయబోతోంది. ముఖ్యంగా రెడ్ మీ లైనప్ నుంచి తన పాపులర్ మోడల్ తో సహా అనేక కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. అందులో రెడ్ మీ-13 ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. జూలై 12న మధ్యాహ్నం ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ధర, వేరియంట్లు
కొత్త రెడ్ మీ-13 రెండు వేరియంట్లలో లాంచ్ చేయబోతోంది కంపెనీ. ఒకటి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ధర రూ.12,999గా (రూ.1,000 బ్యాంక్ ఆఫర్ తో కలిపి) నిర్ణయించింది. రెండోది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా(బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ తో కలిపి) నిర్ణయించారు.
డిస్ ప్లే, డిజైన్
రెడ్ మీ-13 5జీలో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, స్మూత్ విజువల్స్ ఉన్నాయి. ఇందులో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్ గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంది. డ్యూయల్ సైడ్ గ్లాస్ ను అందించే సెగ్మెంట్ లో మొదటిది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ అందిస్తుంది.
స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) ఎస్‌వోసీ ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమి హైపర్ ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేయనుంది.
కెమెరా..
శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సార్ తో కూడిన 108 మెగాపిక్సెల్ కెమెరా, క్లారిటీ ఫొటోస్ కోసం 9-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణ. దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా పొందుపరిచారు. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. వెనుక భాగంలో రింగ్ ఫ్లాష్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు.
బ్యాటరీ, ఛార్జింగ్
ఈ డివైజ్ 5030 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.
రెడ్ మీ-13 5జీలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ53 రేటింగ్ తో దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, బాటమ్ ఫైరింగ్ లౌడ్ స్పీకర్ ఉన్నాయి. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6, బ్లూ-టూత్ 5.1, జీపీఎస్+ గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీలను సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 13 5జీ 168.6×76.28×8.17 ఎంఎం, బరువు 199 గ్రాములుగా ఉంది.
రెడ్ మీ-13 5జీ కోసం 2 సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్లను షియోమీ అందించనుంది.