Homeబిజినెస్RedMagic 11S Pro: RedMagic 11S Pro.. ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా..

RedMagic 11S Pro: RedMagic 11S Pro.. ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా..

RedMagic 11S Pro: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువగా యూత్ ఉన్నారు. వీర గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారి కోసం అత్యుత్తమ మొబైల్ గేమింగ్, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో ఉండే మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అదే RedMagic 11S Pro.ఇది ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Elite (Gen 5) Leading Version చిప్‌సెట్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఎలా ఉందో తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

RedMagic త్వరలో మార్కెట్లోకి 11S Proను తీసుకురాబోతుంది. ఇది 11 Pro సిరీస్‌కు mid cycle refresh‌గా రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ ప్రధానంగా గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరచడానికి రూపొందిస్తున్నారు. 11S Pro డిజైన్‌ చాలా వరకు RedMagic 11 Pro లాగే ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్పరెంట్ స్టైల్ లో, ఫ్లష్ కెమెరా, active cooling fan ఉండనుంది. అలాగే ఈ మొబైల్ సిల్వర్ వింగ్, డార్క్ నైట్ వంటి కలర్లలో రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 144Hz refresh రేట్ తో పనిచేస్తుంది. 2K రిజల్యూషన్ తో gaming experience కోసం sharp panel ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా లోపల ఉండే డిస్ ప్లే selfie camera ఉండే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి front camera cutout లేకుండా full-screen gaming అనుభవం దొరకొచ్చు.

ఈ 11S Proలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది overclocked Leading Version chip‌తో వస్తుంది, అంటే standard version కంటే కొంచెం ఎక్కువ clock speed ఉండొచ్చు. upgraded built-in fan తో పాటు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ , long gaming sessionsలో heat control కోసం advanced thermal design ఉండొచ్చు.

బ్యాటరీ విభాగంలో 7,500mAh లేదా కొన్నిరిపోర్టుల ప్రకారం 8,000mAh వరకు capacity ఉండొచ్చని సమాచారం ఉంది. Wired charging 80W వరకు, అలాగే కొన్ని లీక్‌లలో wireless charging support కూడా కనిపిస్తోంది. కానీ ఇది అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఈ మొబై్ లో 50MP రియర్ కెమెరా, సెల్పీ కోసం 16MP కెమెరా ఉండనుంది. REDMAGIC OS 11 ఆధారంగా Android 16 రావొచ్చని సమాచారం. ఇప్పటివరకు అధికారికంగా ధర గురించి బయటకు రాలేదు. అయితే గత RedMagic 11 Pro price ఆధారంగా చూస్తే, 11S Pro కూడా premium gaming segmentలోనే ఉండే అవకాశం ఉంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version