RBI Stops Printing Notes : తన వార్షిక నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నోట్ల ముద్రణలో నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికను సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఇప్పటివరకు చాలామందిలో ఉన్న కరెన్సీ నోట్లు అలాగే నాణేలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని రిలీజ్ చేసింది. మార్కెట్లో చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో 2000 రూపాయల నోటు చలామణి నుంచి తొలగించే ప్రక్రియను మొదలుపెట్టింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చిన్న నివేదికలో మొత్తం రూ.3.56 లక్షల కోట్లలో మార్చి 2025 నాటికి 98.2% బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఈ నోట్లో చాలా తక్కువగా మిగిలి ఉన్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజా ధారణ పొందిన నోటు 50 నోటు.
Also Read : నెలకు రూ.10 వేలు పెడితే చాలు రూ.1.6 కోట్లు అందుకోవచ్చు.. ఇది నిజంగా అద్భుతమైన స్కీమ్..
ఈ మధ్యకాలంలో మనదేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న నోటు 500 నోటు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో 40.9 శాతం వాటా ఇది కలిగి ఉంది. మార్కెట్ వాటాలో ఈ నోటు మాత్రమే మొత్తంగా 86% కలిగి ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై ₹2,₹5,₹2000 నోట్లను ముద్రించబోమని ప్రకటించడం జరిగింది. ఆర్బిఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో కొత్త స్టాక్ ఇకపై మార్కెట్లోకి రాదు అని తెలుస్తుంది.
ఇకపై దేశంలో ఈ మూడు నోట్లను ముదిరించేది లేదు అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు అలాగే నాణేల వినియోగం పెరుగుతున్న సమయంలో మార్కెట్లో ఇప్పుడు 500 రూపాయల నోటు అత్యధిక చలామణిగా ఆదిపత్యం వహిస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా మార్కెట్ నుంచి 2000 రూపాయల నోటును చలామణి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉన్న నోట్లలో కేవలం 500 రూపాయల నోట్లు మాత్రమే 40.9% గా ఉన్నాయి. ఇవి 86% గా అత్యధిక విలువ కలిగి ఉన్నాయి.