RBI new Rules for Gold Loans : కేంద్ర ఆర్థిక శాఖలో ఒక భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గోల్డ్ లోన్స్ పై డ్రాఫ్ట్ గైడ్లైన్స్ సవరించాలని కొన్ని ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గోల్డ్ రుణం సిస్టంనీ పారదర్శకంగా ఉండే విధంగా గోల్డ్ పై చిన్న రుణగ్రహితలకు రూల్స్ అనుకూలంగా ఉండేందుకు ఈ సూచనలను జారీ చేశారు. బ్యాంకులకు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఈ సవరణలు అమలు చేసేందుకు మరింత సమయం ఇవ్వనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ X లో మే 30, 2025న దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కి రెండు కీలకమైన మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డి ఎఫ్ ఎస్ రెండు లక్షల వరకు గోల్డ్ లోన్స్ కు కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించారు.
Also Read : భారీ గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏ ఏ నగరాలలో ఎంత ధర ఉందంటే..
అయితే ఇంటి అవసరాలు లేదా వైద్య అవసరాల కోసం బంగారు లోన్స్ పై ఆధారపడుతున్న చిన్న ఋణ గ్రహీతల కోసం ఈ సూచన చేసినట్లు తెలిపారు. గోల్డ్ పై రుణం పొందే చిన్న రుణగ్రతలు ఇకపై కఠినమైన నిబంధనలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్లు సులభంగా మరియు త్వరగా డబ్బు పొందే విధంగా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో డి ఎఫ్ ఎస్ జనవరి 1, 2026 కు కొత్త నిబంధనల అమలులో వాయిదా వేయాలని సిఫార్సు చేసింది. బ్యాంకులో మరియు ఇతర ఆర్థిక సంస్థలకు తమ సిస్టమ్స్ ను అప్డేట్ చేసుకోవడానికి మరింత సమయం కల్పిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెల, 2025లో జరిగిన రివ్యూ సమయంలో గోల్డ్ లోన్స్ సిస్టం లలో సమస్యలను గుర్తించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై తీసుకునే రుణపద్ధతులను స్టాండర్డ్ చేయడానికి కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ లను రిలీజ్ చేసింది. గతంలో ఆర్బిఐ గుర్తించిన సమస్యలలో ఇన్ కన్సిస్టెంట్ లోన్ టు వ్యాల్యూ రేషియో చాలా కీలకమైనది. బంగారంపై రుణం ఇచ్చేవాళ్ళు బంగారం విలువలో 75% కంటే ఎక్కువగా రుణాలను ఇస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో డిఫాల్ట్ రిస్క్ బాగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిస్క్ చెక్స్ సక్రమంగా జరగడం లేదని కూడా గుర్తించింది.