Homeబిజినెస్UPI Payments : పొరపాటున డబ్బులు చెల్లించారా.. భయపడాల్సిన పనిలేదు..రెండు రోజుల్లో రికవరీ.. ఆర్బీఐ కొత్త...

UPI Payments : పొరపాటున డబ్బులు చెల్లించారా.. భయపడాల్సిన పనిలేదు..రెండు రోజుల్లో రికవరీ.. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ!

UPI Payments :  భారత దేశంలో కేంద్రం 2016లో పెద్ద నోట్లు(రూ.500, రూ.1000) రద్దు చేసింది. దీంతో నోట్ల కోసం ప్రజలు దాదాపు ఏడాదిపాటు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనే దేశంలోకి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ స్పేస్‌ ఒక విప్లవంలా వచ్చింది. దీంతో డిజిటల్‌ పేమెంట్స్‌ క్రమంగా పెరిగాయి. తర్వాత 2020లో కరోనా రావడంతో నేరుగా కరెన్సీ నోట్ల చెల్లింపులు బాగా తగ్గిపోయాయి. డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఈ లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది. నగదు చెల్లింపులు సులభతరం అయ్యాయి. కేవలం ఒక్క స్కాన్‌లో రెప్పపాటులో డబ్బును పంపవచ్చు. దీంతో చిన్న పచారీ కొట్టు నుంచి మొదలుకుని పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు అంతటా యూపీఐ చెల్లింపులే జరుగుతున్నాయి. రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ట్రాన్‌సాక్షన్‌ చేస్తున్నారు. ఎక్కడో ఉన్నవారికి క్షణాల్లో డబ్బులు పంపుతున్నారు. అయితే అయితే కొన్ని సార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడీ లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇలా జరిగితే రికవరీ కోసం ఇబ్బంది పడుతున్నారు. నెట్‌వర్క్‌ సమస్య కారణంగా కూడా కొన్నిసార్లు డబ్బులు ఖాతా నుంచి కట్‌ అవుతున్నాయి. పంపిన ఖాతాకు చేరడం లేదు. ఈ సమయంలోను వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకనుంచి భయపడాల్సిన పనిలేదు అంటోంది ఆర్‌బీఐ. యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

48 గంటల్లో రికవరీ..
కొత్త నిబంధనల ప్రకారం.. పొరపాటున యూపీఐ ఐడీకి డబ్బును బదిలీ చేస్తే, 24 నుంచి 48 గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. పంపినవారు, స్వీకరించేవారు ఇద్దరూ ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు, వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదే వేరువేరు బ్యాంకులు అయితే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు.

పొరపాటు జరిగితే ఇలా చేయాలి..

– పొరపాటున పంపిన డబ్బు ఎవరికి చేరిందో ఆ వ్యక్తిని సంప్రదించండి. లావాదేవీ వివరాలను తెలిపి డబ్బును తిరిగి పంపమని అభ్యర్థించవచ్చు.

– తప్పు యూపీఐ లావాదేవీ జరిగినప్పుడు వెంటనే యూపీఐ యాప్‌లో కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌తో మాట్లాడండి. లావాదేవీ వివరాలను వారికి ఇవ్వండి.

– యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్‌సీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

– మీ డబ్బును తిరిగి పొందడానికి, డబ్బు కట్‌ అయిన బ్యాంకును సంప్రదించండి. మీ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్‌ మీకు సహాయం చేస్తుంది.

– యూపీఐ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–120–1740కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular