RBI : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఆర్‌బీఐ కూడా ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా రెపోరేటు 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీంతో 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లు తగ్గించిన నేపథ్యంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం. ఆర్బీఐ గరర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ ఫ్రిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై గవర్నర్ కీలక ప్రకటన చేశారు. పూర్వ గవర్నర శక్తికాంత్ దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత సంజయ్ మల్హోత్రా డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలో మొదటి సమావేశంలోనే అందరూ అంచనా వేసినట్లుగానే రెపో బేసిక్ పాయింట్లు 25 తగ్గించారు. దీంతో బెంచ్‌మార్క్ రుణరేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది.
జీడీపీ 6.7%
ఇక రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు నిర్ణయంతో 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి దాదాపు 6.7 శాతంగా అంచనా వేసిందని గవర్నర్ మల్హోత్రా ప్రకటించారు. ద్రవ్యోల్బణం 4.2 శాతం వద్ద కొనసాగుతుందని ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార 6దవ్యోల్బణం తగ్గుతుందని భావించినట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
గత సమావేశంలో..
మాజీ గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన గత సమావేశంలో రెపో రేటులో ఎలాంటి మార్ప చేయలేదు. అయితే నగదు నిల్వ నిష్పత్తి 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.కోటి ట్రిలియన్లను చొప్పించింది. డిసెంబర్ పాలసీలో కీలకమైన చర్య నగదు నిల్వ నిష్పత్తి 50 బేసిక్ పాయిట్లు తగ్గించడమే. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ.1.16 లక్షల కోట్లు ఇంజెక్టు చేయడం.
రెపో రేటు అంటే..
రెపో రేటు పదం చాలాసార్లు వింటాం. కానీ దానిగురించి చాలా మందికి తెలియదు. రెపోరేటు అంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వేసే వడ్డీ. రెపోరేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకుల అనర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వే బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రుణాలు పొందుతాయి. బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడే లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్టెకలో డబ్బు ప్రవాహం నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపోరేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణంపై మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపోరేటు పెంచుతుంది.
వడ్డీ భారం తగ్గే ఛాన్స్..
వాణిజ్యం బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రిటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆమేరకు తగ్గించే అవకాశం ఉంది. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారికి ఊరట కలుగుతుంది.