https://oktelugu.com/

EV cars: పంచ్, ఇన్ స్టర్, సిట్రియోన్.. ఈ మూడు ఈవీ కార్ల మధ్య తేడా ఏంటి?

EV cars: ఆటోమోబైల్ రంగంలో దిగ్గజ కంపెనీనీగా ఉన్న హ్యుందాయ్ కంపెనీ ఇన్ స్టర్ అనే ఈవీని 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబలిటీ షో లో ప్రదర్శించింది. ఇది త్వరలోనే మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. హ్యుందాయ్ ఇన్ స్టర్ 2,580 వీల్ బేస్ ను కలిగి ఉంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2024 / 11:37 AM IST

    Hyundai Inster vs Tata Punch EV vs Citroen eC3

    Follow us on

    EV cars: ఆటోమోబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాల్లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సైతం ముందుకు వస్తుండడంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా వీటి ఉత్పత్తిని పెంచుతున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లకి వచ్చి కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)లపై కొందరికి అనేక సందేహాలు ఉన్నాయి. వీటిలో టాటా పంచ్, హ్యుందాయ్ ఇన్ స్టర్, సిట్రోయిర్ ఈవీలు ఒకటికి మంచి మరొకటి పోటీ పడుతున్నాయి. అయితే వీటిలో ఉండే ఫీచర్లు ఏంటి? ఈ మూడు కార్ల మధ్య తేడాలు ఏమున్నాయి? అనే సందేహాలు ఉన్నాయి. మరి ఆ తేడాలు ఏంటో చూద్దాం..

    ఆటోమోబైల్ రంగంలో దిగ్గజ కంపెనీనీగా ఉన్న హ్యుందాయ్ కంపెనీ ఇన్ స్టర్ అనే ఈవీని 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబలిటీ షో లో ప్రదర్శించింది. ఇది త్వరలోనే మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. హ్యుందాయ్ ఇన్ స్టర్ 2,580 వీల్ బేస్ ను కలిగి ఉంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది 9 బీహెచ్ పీ నుంచి 115 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్ స్టర్ లో 42 kWh, 49 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. ఇది 120 కిలో వాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ తో 30 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. మొత్తంగా 4 గంటల 35 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని ధర ఇంకా తెలపకపోయినా 10.99 లక్షల నుంచి 15.49 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

    మరో కంపెనీ టాటా పంచ్ ఈవీ 1,742 మిల్లి మీటర్ల పొడవులో ఉంటుంది. ఇది 366 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. టాటా పంచ్ 122 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 25 కిలోవాట్లు లేదా 35 కిలో వాట్ల బ్యాటరీ ఉండనుంది. ఇది 56 నిమిాషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. మొత్తంగా పూర్తి ఛార్జింగ్ కోసం 9 నుంచి 13 గంటల సమయం పడుతుంది. టాటా పంచ్ ఈవీ ధర 10.99 లక్షల నుంచి 13.79 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

    మూడో ఈవీ సిట్రోయిన్ 3,981 మిల్లి మీటర్ల పొడవుతో ఉంది. ఇందులో 57 బీహెచ్ పీ పవర్ 143 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయిన్ లో 29.2 కిలో టవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది 57 నిమిషాల్లో 10 నుంచి 100 శాతం వరకు చార్జ్ అవుతుంది. దీంతో 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సిట్రియోన్ ను రూ.11.61 నుంచి రూ.13.41 వరకు విక్రయిస్తున్నారు.