https://oktelugu.com/

Pension Scheme: నెలకు రూ.55 డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా పొందాలంటే?

Pension Scheme: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అసంఘటిత రంగంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రతి నెలా ఈ స్కీమ్ లో 55 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశంలో 46 లక్షల కంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 6, 2022 / 06:00 PM IST
    Follow us on

    Pension Scheme: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అసంఘటిత రంగంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రతి నెలా ఈ స్కీమ్ లో 55 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 3,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశంలో 46 లక్షల కంటే ఎక్కువమంది ఈ స్కీమ్ లో చేరారు.

    55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు డిపాజిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు అని చెప్పవచ్చు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది.

    బ్యాంక్ ఖాతా, జన్ ధన్ ఖాతా సహాయంతో ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ అందజేయడం ద్వారా సులభంగా ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    నెలకు 15,000 రూపాయల కంటే తక్కువ వేతనం పొందుతున్న వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.