https://oktelugu.com/

మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీరేట్లను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది. కేంద్రం వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కేంద్రం నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 1, 2021 / 11:07 AM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీరేట్లను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది. కేంద్రం వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కేంద్రం నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?

    స్మాల్ సేవింగ్ స్కీమ్స్ విషయంలో గత త్రైమాసికంలో ఎంత వడ్డీ ఉందో ఈ త్రైమాసికంలో కూడా అదే వడ్డీ అమలవుతూ ఉండటం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వడ్డీరేట్లకు సంబంధించి స్పష్టతనిచ్చి ప్రజలలో చాలామందికి ఊరట కలిగేలా చేశారు. మొదట కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు నుంచి వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి రావాల్సి ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చి ఉంటే వడ్డీ రేట్లు 110 బేసిస్ పాయింట్ల మేర తగ్గేవి.

    కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లపై పాత వడ్డీ రేట్లు కొనసాగుతాయని కొత్తగా ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్ల విషయంలో వెనక్కు తగ్గినట్టు ప్రకటన వెలువడింది. నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న సిలిండర్ ధరలు..?

    నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ కు వేల సంఖ్యలో లైక్ లు రావడంతో పాటు చాలామంది ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తుండటం గమనార్హం. కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఎక్కువ వడ్డీ అందిస్తున్న సంగతి తెలిసిందే.