https://oktelugu.com/

ఐవోసీఎల్ లో 1968 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురును అందించింది. 1968 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వేర్వేరు ట్రేడులలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 27, 2021 / 09:22 AM IST
    Follow us on

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురును అందించింది. 1968 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వేర్వేరు ట్రేడులలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను కూడా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని చెప్పవచ్చు.

    బీఏ, బీఎస్సీ, బీకాం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2021 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ నెల 21వ తేదీన రాతపరీక్ష జరగనుంది. ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    గుహావటి, బరౌనీ, డిగ్బాయ్, గుజరాత్, హల్డియా, మథురా, పానిపట్ ప్రంతాలలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.