పోస్టాఫీసుల్లో ప్రస్తుతం ఎన్నో స్కీమ్స్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. పోస్టల్ శాఖ కస్టమర్లు మెరుగైన రాబడిని పొందాలనే ఆలోచనతో ఈ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందవచ్చు.
ఈ స్కీమ్ ను లైఫ్ అస్యూరెన్స్ పాలసీ అని కూడా చెబుతారు. 19 సంవత్సరాల వయస్సు నుంచి 55 సంవత్సరాల మధయ వయస్సు ఉన్నవాళ్లు 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు బీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత లోన్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఇండియా పోస్టల్ ఈ పాలసీపై 1,000 రూపాయలకు 60 రూపాయలు బోనస్ అందించనుంది.
ప్రీమియం టర్మ్ ను బట్టి ప్రీమియం మొత్తాన్ని ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీకి నామినీ సౌకర్యం కూడా అందుబాటులో ఉండగా సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 19 సంవత్సరాల వయస్సులో 10 లక్షల రూపాయలతో బీమా పాలసీ తీసుకుని నెలకు 1500 రూపాయల చొప్పున చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ 35 లక్షల రూపాయలుగా ఉంటుంది.