https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే ఛాన్స్?

మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తూ ఉంటారు. పోస్టాఫీస్ ఇలాంటి వాళ్లకు అదిరిపోయే తీపికబురును అందించింది. కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్ ను సులభంగా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 1,55,000 పోస్టాఫీసులు ఉండగా ఆ పోస్టాఫీసులలో ఎక్కువ పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. అయితే ఫ్రాంఛైజ్‌ ద్వారా రూరల్, అర్బన్ ఏరియాలలో కూడా ఈ సేవలను మరింత విసృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైతే పోస్టాఫీస్ ఫ్రాంఛైజీని తీసుకుంటారో వాళ్లు మనీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2021 8:59 am
    Follow us on

    మనలో చాలామంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తూ ఉంటారు. పోస్టాఫీస్ ఇలాంటి వాళ్లకు అదిరిపోయే తీపికబురును అందించింది. కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్ ను సులభంగా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 1,55,000 పోస్టాఫీసులు ఉండగా ఆ పోస్టాఫీసులలో ఎక్కువ పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. అయితే ఫ్రాంఛైజ్‌ ద్వారా రూరల్, అర్బన్ ఏరియాలలో కూడా ఈ సేవలను మరింత విసృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ఎవరైతే పోస్టాఫీస్ ఫ్రాంఛైజీని తీసుకుంటారో వాళ్లు మనీ ఆర్డర్స్ సర్వీస్ తో పాటు స్పీడ్ పోస్ట్, బుకింగ్ రిజిష్టర్డ్ ఆర్టికల్స్ ను అందించే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజీ సహాయంతో సులభంగా స్టాంప్స్, స్టేషనరీని కూడా అమ్ముకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బిల్స్, ట్యాక్సులు, పన్నుల చెల్లింపులు, వసూళ్లు కూడా పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ ద్వారా చేయవచ్చు. ఎవరైతే ఈ ఫ్రాంఛైజీని తీసుకోవాలని అనుకుంటారో వాళ్లకు కొన్ని అర్హతలు ఉండాలి.

    కనీసం ఎనిమిదో తరగతి చదివిన వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద 5,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు డివిజనల్ ప్రధాన అధికారికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వివరాలను పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అధికారులు ఫ్రాంఛైజీకి మీరు అర్హులా? కాదా? నిర్ణయించడం జరుగుతుంది.

    18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి, పోస్టాఫీస్ ఉద్యోగం చేసేవారికి, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఫ్రాంఛైజీని ఇవ్వడం జరగదు. పంచాయత్‌ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ సెంటర్లు ఉన్న గ్రామాలకు కూడా ఫ్రాంఛైజీని ఇవ్వరు. ఈ ఫ్రాంఛైజీ తీసుకోవడం వల్ల సేవలపై లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.