https://oktelugu.com/

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.10వేల పొదుపుతో రూ.16 లక్షలు పొందే ఛాన్స్?

మన దగ్గర ఉండే డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుత కాలంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో పోస్టాఫీస్ కూడా ఒకటి కాగా పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా కేవలం 100 రూపాయలతో కూడా పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2021 / 02:37 PM IST
    Follow us on

    మన దగ్గర ఉండే డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుత కాలంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో పోస్టాఫీస్ కూడా ఒకటి కాగా పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి కాగా కేవలం 100 రూపాయలతో కూడా పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఈ స్కీమ్ కు గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎంత మొత్తం అయినా డిపాజిట్ చేయవచ్చు. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడిని ఈ స్కీమ్ ద్వారా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గడువు ఐదు సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ గడువును మరో ఐదు సంవత్సరాలు పెంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐదేళ్ల తర్వాత ఈ స్కీమ్ ను మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

    ఈ స్కీమ్ పై ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ అమలవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేటు మారే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీరేట్లను సమీక్షించనుంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు 10,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 16.28 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పదేళ్ల పాటు వరుసగా డిపాజిట్ చేస్తే మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పూర్తిస్థాయిలో పొందవచ్చు.

    సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.