Ghani: వరుణ్​ ‘గని’ బాడీ ట్రాన్ఫర్మెషన్​పై చిరు ఆసక్తికర కామెంట్​!

Ghani: ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె సినిమాతో తనలోని నటనకు ఆజ్యం పోసిన పోసిన హీరో వరుణ్​ తేజ్​. ప్రస్తుతం వరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా గని. స్పోర్ట్స్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్​ తే సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. Fantastic transformation for #Ghani my dear @IAmVarunTej .Shows your hard work & passion for the […]

Written By: Raghava Rao Gara, Updated On : November 17, 2021 2:51 pm
Follow us on

Ghani: ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె సినిమాతో తనలోని నటనకు ఆజ్యం పోసిన పోసిన హీరో వరుణ్​ తేజ్​. ప్రస్తుతం వరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా గని. స్పోర్ట్స్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్​ తే సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మెల్లగా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించాయి. తాజాగా, ఈ సినిమా ట్రైలర్​పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందులో వరుణ్ తేజ్​ బాడీ ట్రాన్స్​ఫర్మేషన్​పై ఆసక్తికర కామెంట్​ చేశారు.

ఫెంటాస్టిక్​ ట్రాన్ఫర్మేషన్​ వరుణ్​ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పాత్ర కోసం వరుణ్ చేసిన హార్డ్​వర్క్​, తనకున్న ప్యాషన్​ అర్ధమవుతోందని అన్నారు. ఈ సినిమా వరుణ్​ తేజ్​కు, చిత్రయూనిట్​కు మంచి విజయం తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్​. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్​ 2 సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఇప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.