Post Office New Schemes: సాధారణ, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు పోస్టాఫీస్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను పోస్టాఫీస్ అందుబాటులోకి తీసుకురాగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ లేకుండానే ఎక్కువ మొత్తంలో రాబడిని కచ్చితంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ పథకం ద్వారా పోస్టాఫీస్ ఖాతాదారులు అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ విషయంలో 7.4 శాతం వడ్డీ అందుతోంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం 5 సంవత్సరాలలో 4 లక్షల లాభం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన వాళ్లు 60 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా కస్టమర్లు కోరుకుంటే కాలపరిమితిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
కనిష్టంగా 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఏకంగా 14,28,964 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. వడ్డీ 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే టీడీఎస్ తగ్గించబడుతుంది. సీనియ సిటిజన్లు ఆదాయపు పన్ను మినహాయింపును కూడా పొందే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ ఖాతాను తెరిచే లేదా మూసే సమయంలో నామినీ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.