Post Office Scheme: ప్రస్తుత కాలంలో ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమైన స్కీమ్స్ అని చెప్పవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ప్రతి నెలా ఆదాయం పొందాలని భావించే వాళ్లు వెంటనే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై 6.6 శాతం రాబడి లభిస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలుగా ఉండనుందని తెలుస్తోంది. ముందుగానే కొంత మొత్తం ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పాలి. ఈ స్కీమ్ లో గరిష్టంగా నాలుగున్నర లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఏడాదికి 29,700 రూపాయలు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ ఖాతాలలో ప్రతి నెలా పొదుపు చేసిన డబ్బులు జమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి.
ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి రాబడిలో మార్పులు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీకి ముందు విత్ డ్రా చేయాలని అనుకుంటే ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.