ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

ప్రస్తుత కాలంలో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ చదవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని అనుకుంటున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉండటం వల్ల రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంటే మరి కొందరు రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా సమాజం అభివృద్ధి కోసం శ్రమించాలని భావిస్తుండటం గమనార్హం. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా మన దేశం అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలిచే అవకాశాలు కూడా […]

Written By: Navya, Updated On : January 24, 2022 7:13 pm
Follow us on

ప్రస్తుత కాలంలో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ చదవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని అనుకుంటున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉండటం వల్ల రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంటే మరి కొందరు రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా సమాజం అభివృద్ధి కోసం శ్రమించాలని భావిస్తుండటం గమనార్హం.

సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా మన దేశం అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. మన దేశ పౌరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.

ఓటు హక్కును కలిగి ఉన్న వ్యక్తులు ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయడానికి అర్హులు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండటంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. గరిష్టంగా రెండు స్థానాల నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండు స్థానాలలో విజయం సాధిస్తే ఒక స్థానంకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో పూర్తి వివరాలతో పాటు పన్ను చెల్లింపు వివరాలను, కోర్టు కేసుల వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.