Postoffice Scheme: దేశంలో ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటిగా ఉంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి 1,40,000 రూపాయలు వస్తాయి.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి ఎలాంటి రిస్క్ ఉండదు. బ్యాంక్ దివాలా తీస్తే కేవలం రూ.5 లక్షలు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో మాత్రం పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి రక్షణ లభిస్తుంది కాబట్టి ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎన్ఎస్‌సీ అకౌంట్ ను మైనర్ పేరుపై కూడా తెరిచే ఛాన్స్ అయితే ఉంటుంది. అవసరం అనుకుంటే మెచ్యూరిటీ కంటే ముందు ఈ స్కీమ్ నుంచి బయటకు రావచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు కింద బెనిఫిట్స్ లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా పొందే బెనిఫిట్స్ మొత్తంలో మార్పు ఉంటుందని గుర్తుంచుకోవాలి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.