https://oktelugu.com/

Ram Charan Birthday Special: చరణ్ బర్త్ డే స్పెషల్.. చెర్రీ ఎప్పటికీ ప్రత్యేకమే

Ram Charan Birthday Special: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ పుట్టినరోజు చరణ్ కి ప్రత్యేకం, కారణం.. ఆర్ఆర్ఆర్ విజయం. ప్రస్తుతం అభిమానులు చరణ్ కి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్‌ తో పోటీ పడి నటించాడు. ఫలితంగా చరణ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ? అంటూ బాలీవుడ్‌ సైతం […]

Written By:
  • Shiva
  • , Updated On : March 27, 2022 / 10:08 AM IST
    Follow us on

    Ram Charan Birthday Special: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ పుట్టినరోజు చరణ్ కి ప్రత్యేకం, కారణం.. ఆర్ఆర్ఆర్ విజయం. ప్రస్తుతం అభిమానులు చరణ్ కి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్‌ తో పోటీ పడి నటించాడు. ఫలితంగా చరణ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ? అంటూ బాలీవుడ్‌ సైతం ఆశ్చర్యపోయింది.

    Ram Charan Birthday Special

    రామ్ చరణ్ ‘చిరుత’తో హీరోగా మారాడు. కానీ, ‘మగధీర’తో భారీ విజయాన్ని అందుకుని స్టార్ అయ్యాడు. ఆ సినిమా ఇండస్ట్రీకే సూపర్ హిట్‌. అప్పట్లో కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. ఆ కలెక్షన్స్ చూసి ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. పైగా సినిమాకి సినిమాకి చరణ్ రేంజ్ కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది. కాకపోతే.. రామ్ చరణ్ స్థాయి ‘రంగస్థలం’ తర్వాత మరో రేంజ్ కి వెళ్ళింది.

    Also Read: Aishwarya Rajinikanth: ప్చ్.. అన్ని చోట్ల తీసిపారేసిన ఐశ్వర్య రజనీకాంత్‌ !

    ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. పైగా ఆ చిత్రంతోనే చరణ్ పరిపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ లో చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ప్రస్తుతం చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం కొరటాల – చిరు కలయికలో వస్తున్న ‘ఆచార్య’లోనూ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్‌ తోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

    అలాగే, గౌతమ్ తిన్ననూరితోనూ చరణ్ ఓ సినిమా ప్లాన్ చేశాడు. మొత్తానికి చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చరణ్. సినిమాల పరంగా హీరోగా, నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తూనే.. భార్య ఉపాసన కోసం అపోలో ఆస్పత్రిలో భాగమై ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు. అన్నిటికీ మించి తన తండ్రి మెగాస్టార్ సేవలోనూ పాలు పంచుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఆక్సీజన్ బ్యాంక్‌లు ఇలా ఎన్నో నడుపుతూ తానూ ప్రాణదాత అనిపించుకున్నాడు.

    Ram Charan Birthday Special

    అందుకే.. చరణ్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ఈ రోజు కోసం చరణ్ ఫ్యాన్స్ పెద్ద పనే పెట్టుకున్నారు. అందుకు ట్విట్టర్ ను వేదికగా మార్చుకున్నారు. ఇండియా వైడ్ గా చరణ్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలనేది చరణ్ అభిమానుల టార్గెట్. చరణ్ స్టార్ డమ్ ఏమిటో ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటి చెప్పడానికి ఫ్యాన్స్ గత వారం నుంచే సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే చరణ్ ఫ్యాన్ గ్రూప్స్ తో పాటు అభిమాన సంఘాలను కూడా అలెర్ట్ చేశారు. ఈ రోజు అభిమానులు తమ వ్యక్తిగత పనులకు బ్రేక్ ఇచ్చి.. అందరూ చరణ్ బర్త్ డే ట్యాగ్ ను వైరల్ చేయాలని తీర్మానం చేసుకున్నారు. మరి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి. అన్నట్టు చరణ్ కి మా ఓకేతెలుగు.కామ్ ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది.

    Also Read: Competition For RRR: పోటీలో ‘ఆర్ఆర్ఆర్’ ఉన్నా మా సినిమా సూపర్ హిట్టే !

    Tags