
కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ల ద్వారా ఎన్నో రకాల స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లలో కొన్ని స్కీమ్ లు తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పోస్టాఫీస్ స్కీమ్ లలో ఒకటైన మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా కనీస మొత్తానికి మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరాలనే ఆసక్తి ఉన్నవాళ్లు సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ లో చేరవచ్చు.
Also Read: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర..?
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ లను అందజేసి మంత్లీ ఇన్ కమ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఖాతాను సులువుగా తెరవవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. వయస్సుకు సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు లేకపోవడంతో ఏ వయస్సు వాళ్లైనా ఈ స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. సంవత్సరంలో కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
Also Read: ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.14 వేలు పెన్షన్ పొందే ఛాన్స్..?
ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఒకే విడతలో లేదా వేర్వేరు వాయిదాలలో డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. అయితే జాయింట్ అకౌంట్ తెరిచే అవకాశం మాత్రం లేదు. సంవత్సరానికి గరిష్టంగా లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 43 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు రాబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము
మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఐపిపిబి ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో రుణం తీసుకునే సౌకర్యం కూడా ఉండటం గమనార్హం. రుణం తీసుకునే సౌకర్యం ఉండటం వల్ల స్కీమ్ లో చేరేవాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Comments are closed.