Post Office : పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న పొదుపు పథకాలు అనేక మారుమూల గ్రామాలలో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఖాతాలను తెరిచేందుకు మాత్రం అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కొంచెం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో తాజాగా పోస్ట్ ఆఫీస్ శాఖ వారు ఎంపిక చేసుకున్న పొదుపు పథకాలను తెరవడానికి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. పోస్ట్ ఆఫీస్ వారు అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైం డిపాజిట్, కిసాన్ వికాస్ పాత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి అనేక పొదుపు పథకాలను తెరవడానికి ఇకపై పేపర్ వరకు అవసరం లేకుండా ఆధార్ కార్డు బయోమెట్రిక్ ధ్రువీకరణను పోస్ట్ ఆఫీస్ అమలు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా పేపర్ వర్క్ లేకుండా వేగంగా జరుగుతుంది. దీనికి ఫిజికల్ డిపాజిట్ స్లిప్తో కూడా పని ఉండదు.
Also Read : ఎటువంటి షూరిటీ లేకుండా మహిళలకు రుణం ఇస్తున్న ఎస్బిఐ…ఎంత రుణం వస్తుందంటే..
పోస్ట్ ఆఫీస్ శాఖ ఏప్రిల్ 23వ తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైం డిపాజిట్, కిసాన్ వికాస్ పాత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధి చెందిన పొదుపు పథకాలను తెరవడానికి ప్రతి ఒక్కరికి ఆధార ఆధారిత ఈ కేవైసీ ప్రక్రియను అమలు చేస్తుంది.గతంలో జనవరి ఆరవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కూడా అన్ని పోస్ట్ ఆఫీస్ శాఖలలో పొదుపు ఖాతాలను తెరవడం అలాగే నిర్వహించడం కోసం ఆధార ఆధారిత ఈ కేవైసీని అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ ఓచర్లు మరియు భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అమలులోనే ఉంది. కస్టమర్లు తమకు ఏ విధానం అనువైనదో దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా మూసివేయాలి అనుకుంటే ఆధార బయోమెట్రిక్ అథెంటికేసన్ ద్వారా ఖాతా బదిలీలు లేదా నామినేషన్ అప్డేట్స్ వంటివి చేయాలి అనుకుంటే వాటికి సంబంధించి ఇంకా డిజిటల్ ఫీచర్లు అభివృద్ధి దశలోనే ఉన్నాయి. వీటికి సంబంధించి డిజిటల్ ఫీచర్లు త్వరలో ప్రవేశ పెట్టే అవకాశం ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. అప్పటి వరకు కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఇటువంటి సేవలు గతంలో మాదిరిగానే సాంప్రదాయ ప్రక్రియలోనే జరుగుతాయి. అన్ని పోస్ట్ ఆఫీస్ల సిబ్బందికి కూడా ప్రస్తుతం ఖాతాలు తెరుస్తున్న కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఖాతా కలిగి ఉన్న వారందరూ కూడా పేపర్ లెస్ ఈ కేవైసీ ప్రక్రియను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేయడం జరిగింది.